
మంచి స్నేహితులను మనం మాత్రమే ఎంచుకోవాలి
సత్తెనపల్లి: తల్లిదండ్రులు, బంధువులను భగవంతు డే ఇస్తాడు.. మంచి స్నేహితులను మాత్రం మనమే ఎంచుకోవాని ప్రకాశం జిల్లా న్యాయమూర్తి పోకరాజా వెంకటాద్రి అన్నారు. సత్తెనపల్లిలోని కార్తికేయ రెసిడెన్సిలో ఆదివారం స్నేహితుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. 1982–84 సత్తెనపల్లి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ అభ్యసించిన పూర్వ విద్యార్థులు సమావేశం నిర్వహించారు. ఒంగోలు జిల్లా జడ్జి వెంకటాద్రి మాట్లాడుతూ టెక్నాలజీ పెరిగిపోతున్న తరుణంలో, వాట్సాప్, ఇన్‌స్ర్ట్రాగామ్ గ్రూపులతో గతానికి భిన్నమైన దగ్గర తనాన్ని చవిచూస్తున్నారన్నారు. మాటల్లో చెప్పలేని స్నేహం విలువను తెలియజేయడానికి, చరిత్రలో ఓ రోజును కేటాయించారని, ధృడత్వం ఇచ్చే తొలి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ఆపదలో అవసరాన్ని, బాధలో మనస్సును తెలుసుకుని సహాయపడేవాడే నిజమైన స్నేహితుడని పేర్కొన్నారు. మన సహాయం ఎప్పుడూ ఒకరి కడుపు నింపేలా ఉండాలి కాని, మన అవసరం, ఇంకొకరి కడుపు కొట్టేలా ఉండకూడదని సూచించారు. 39 సంవత్సరాల తరువాత మళ్లి చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ముఖ్య అతిథిగా ఎం.వి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు. సభకు సీనియర్ న్యాయవాది రాజారపు శివనాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అన్నం మురళి, పి.శ్రీనివాసరావు, అంకాళ్ల తిరుపతిరావు, డోగిపర్తి సత్యనారాయణ, షేక్ అబ్దుల్‌రహీం, ఖాజావలి, షేక్ గౌస్, చెరుకూరి శ్రీనివాసరావు, రామజోగి, దోరెడ్ల తిరుపతిరావు, చింతగింజల సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, నారాయణ, పులి మల్లయ్య, పెద్ద శ్రీనివాసరావు, పి.చిన్న శ్రీనివాసరావు, కె.మాబు, పెద్దిరాజు, వెంకటేశ్వరరావు, విక్టర్ మాస్టారు పాల్గొన్నారు.
ఒంగోలు జిల్లా జడ్జి పోకరాజా వెంకటాద్రి
సత్తెనపల్లిలో ఘనంగా స్నేహితుల
దినోత్సవం