మెడలో బంగారు గొలుసు మాయం
వినుకొండ: వినుకొండలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. కొత్తపేటలో నివాసం ఉంటున్న వృద్ధురాలు కొప్పరపు సావిత్రి(70)ని దుండగులు పట్టపగలే హత్య చేసి మెడలోని బంగారు గొలుసు చోరీ చేశారు. సమాచారం తెలుసుకున్న టౌన్ సీఐ శోభన్‌బాబుతోపాటు పోలీసు సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. బంగారు గొలుసు కోసమే హత్యచేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూ ఇంటిలో లేకపోవటం గమనార్హం. పగలే హత్య చేసి టీవీ సౌండ్ ఎక్కువగా పెట్టి పరారయ్యారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి.ఆంజనేయులు ఇంటికి కొద్దిదూరంలోనే ఈ దారుణం చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డాగ్‌స్క్వాడ్ తో పరిశీలన అనంతరం పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి కేసును త్వరలోనే ఛేదిస్తామని సీఐ తెలిపారు.
వైద్యమిత్రల ధర్నా
నరసరావుపేట: డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో గత 17 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా తమకు ఇప్పటికీ సరైన జీతాలు లేక తమ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని వైద్యమిత్రలు విన్నవించారు. సోమవారం ప్రకాష్‌నగర్‌లోని ఎన్టీఆర్ వైద్యసేవ కార్యాలయం ముందు శాంతియుత నిరసన చేపట్టారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయంలో అందజేశారు. తాము ప్రతి నెట్‌వర్క్ హాస్పిటల్‌లో ఆస్పత్రికి, రోగులకు మధ్య అనుసంధాన కర్తలుగా వుంటూ పేద ప్రజలకు సేవలు అందజేస్తున్నామన్నారు. చాలీచాలని జీతాలతో కుటుంబపోషణ భారంగా మారిందన్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, తమ సర్వీసుని పరిగణనలోకి తీసుకొని ట్రస్ట్ ఉద్యోగిగా కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవాలని కోరారు. ఉద్యోగ విరమణ తరువాత కుటుంబానికి రూ.15లక్షల గ్రాడ్యూటీ ఇవ్వాలని, అంతర్గత ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు.
గోగులమ్మను తాకిన
సూర్య కిరణాలు
పెదపులివర్రు (భట్టిప్రోలు): పెదపులివర్రు గ్రామ దేవత శ్రీ గోగులమ్మను సోమవారం ఉదయం సూర్య కిరణాలు తాకాయి. ఏటా ఫాల్గుణ నెలలో అమ్మ విగ్రహంపై కిరణాలు ప్రసరిస్తాయని అర్చకులు దీవి గోపి తెలిపారు. ఈ అపురూప దృశ్యాన్ని భక్తులు దర్శించుకుని తరించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
మత్స్యావతారంలో శ్రీవారు
మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సోమవారం స్వామివారి ఆస్ధాన అలంకార ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈవో రామకోటిరెడ్డి ఉత్సవాన్ని పర్యవేక్షించారు. కై ంకర్యపరులుగా హైదరాబాద్‌కు చెందిన దూర్జటి మధుసూధనరావు, చెంచు వెంకట సుబ్బారావులు వ్యవహరించారు. ఆస్థాన కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన మిళ్లూరి రామచంద్ర శర్మ, కృష్ణవేణి దంపతులు వ్యవహరించారు.
వినుకొండలో వృద్ధురాలి హత్య
వినుకొండలో వృద్ధురాలి హత్య
వినుకొండలో వృద్ధురాలి హత్య