ఐదేళ్ల సంక్షేమం చూసి ఓటెయ్యండి
నాదెండ్ల : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలల్లో జరిగిన సంక్షేమం, గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలనివ వైఎస్సార్‌సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు కోరారు. నాదెండ్ల మండలం కనపర్రు పంచాయతీ శివారు గ్రామాలైన మైనంపాడు, మల్లాయపాలెంలో మంగళవారం రాత్రి పర్యటించారు. ఆయా గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు కావటికి ఘన స్వాగతం పలికారు. ముందుగా కనపర్రులోని బాలయేసు పుణ్యక్షేత్రంలో ప్రార్థనలు, ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామి గుడిలో పూజలు చేశారు. అనంతరం ఇటింంటి ప్రచారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కావటి మనోహర్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో పంచాయతీ పరిధిలో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రూ.25 కోట్ల మేర ప్రజలకు ప్రత్యక్ష, పరోక్షంగా లబ్ధి చేకూరిందని వివరించారు. కులం, మతం, వర్గం, పార్టీ ప్రమేయం లేకుండా అర్హతే ప్రామాణికంగా చేసుకుని సంక్షేమ పథకాలను అందించే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని మరోమారు ఆశీర్వదించి జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని అభ్యర్థించారు సర్పంచ్ పెరుమాళ్లపల్లి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ పచ్చల సీతారామయ్య, జడ్పీటీసీ కాట్రగడ్డ మస్తాన్‌రావు, ఎంపీపీ తలతోటి రాణీ, మండల పార్టీ అధ్యక్షుడు మద్దూరి కోటిరెడ్డి, నాదెండ్ల, తూబాడు సొసైటీ అధ్యక్షులు కురుగుంట్ల వెంకటరెడ్డి, మంగు ఏడుకొండలు, పార్టీ నాయకులు గుంజి శ్రీనివాసరావు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జానీబాష, పచ్చవ కోటేశ్వరరావు, మాలే వెంకటస్వామి, నాగేశ్వరరావు, అన్నలదాసు ప్రసాద్, నంబూరి మరియదాసు, పోపూరి జోజియ్య, సాగర్, న్యాయవాది గాలి జయప్రకాష్ తదితరులున్నారు.
చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి
కావటి శివనాగ మనోహర్‌నాయుడు
నాదెండ్ల మండలంలో
ముమ్మరంగా ఎన్నికల ప్రచారం
కనపర్రు, మైనంపాడు, మల్లాయపాలెం గ్రామాల్లో పర్యటన


