తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడిగా శ్రీధర్‌ బాబు | Sridhar Babu elected as president of Telangana Badminton Association | Sakshi
Sakshi News home page

తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడిగా శ్రీధర్‌ బాబు

Apr 22 2026 12:37 AM | Updated on Apr 22 2026 4:21 AM

Sridhar Babu elected as president of Telangana Badminton Association

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే నాలుగేళ్ల కాలానికి తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం (బీఏటీ) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశంలో కొత్త కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయింది. తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడిగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా వి.చాముండేశ్వరనాథ్, వై.ఉపేందర్‌ రావు, జి.వెంకట రావు, పి.రమేశ్‌ రెడ్డి, ఉప్పాల శ్రీనివాస్‌ గుప్తా ఎన్నికయ్యారు. 

జనరల్‌ సెక్రటరీగా భారత జట్టు హెడ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్, కోశాధికారిగా కానూరి వంశీధర్‌ నియమితులయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా ఎల్‌.రవికుమార్, పి.మనోజ్‌ కుమార్, ఎం.జితేందర్‌ రెడ్డి, యు.వి.ఎన్‌.బాబు వ్యవహరిస్తారు. ఎగ్జిక్యూటివ్‌ సభ్యులుగా పి.రాంమోహన్‌ రావు, తోట రంగారావు, కె.శ్రీనివాస రావు, పుల్లూరి సుధాకర్, కొల్లి నాగవేణి ఎన్నికయ్యారు. సలహాదారుడిగా లక్ష్మణ్‌ కొసరాజు వ్యవహరిస్తారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement