గజపతి జిల్లాలో పల్స్‌పోలియోకు అనూహ్య స్పందన | - | Sakshi
Sakshi News home page

గజపతి జిల్లాలో పల్స్‌పోలియోకు అనూహ్య స్పందన

Jun 29 2026 12:53 AM | Updated on Jun 29 2026 12:53 AM

పర్లాకిమిడి: గజపతి జిల్లాలో ఆదివారం నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రిలో, ఎం.సి.హెచ్‌ మెటర్నరీ ఆస్పత్రిలో పోలియో– 2026 కార్యక్రమాన్ని జిల్లా ముఖ్యవైద్యాధికారి, పబ్లిక్‌ హెల్త్‌ అధికారి మంజురాణీ జెన్నా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 5,070 పోలియో బూత్‌లలో మూడు రోజుల పాటు 66,363 మంది శిశువులకు పోలియో చుక్కలమందు వేయడానికి లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో పలువురు 0 నుండి 5 ఏళ్ళ చంటిపిల్లలకు పోలియో చుక్కలు వేసి సీడీఎంవో మంజురాణీ జెన్నా ప్రారంభించారు. కార్యక్రమంలో డీఎంవో డాక్టర్‌ శంతును కుమార్‌ పాఢి, డీపీఎం సరితా మహాపాత్రో, డి.ఎం.ఆర్‌.సి.హెచ్‌.ఎం ప్రణతీ సాహు, స్వచ్చంద సంస్థల కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement