గొంతు కోసి వృద్ధుని హత్య | - | Sakshi
Sakshi News home page

గొంతు కోసి వృద్ధుని హత్య

Jun 29 2026 12:53 AM | Updated on Jun 29 2026 12:53 AM

జయపురం: రాత్రి ఇంటి ముందు ఆరుబయట నిద్రిస్తున్న వృద్ధుని గొంతు కోసి హత్య చేసిన ఉదంతం వెలుగు చూసింది. ఈ అమానుష హత్యాకాండ జయపురం సబ్‌ డివిజన్‌ బొయిపరిగుడ సమితి చిపాకూర్‌ పంచాయతీ సమితి కావుకుండ గ్రామంలో జరిగింది. హత్య చేసిన వ్యక్తి ఆ గ్రామంలో లక్ష్మణ గొలారి(65) అని పోలీసు అధికారి వెల్లడించారు. గొలారి తన ఇంటి ముంగిట మంచంపై పడుకున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి పదునైన ఆయుధంతో వృద్ధుని గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు, గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఉదయం గొలారి ఇంటివారు లేచి బయటకు వచ్చినప్పుడు లక్ష్మణ గొలారి చూచి బోరు మన్నారు. ఈ సంఘటనతో గ్రామంలో ప్రజలు ఆందోళన చెందారు. మృతుడి కుమారుడు రుతి గొలారి బొయిపరిగుడ పోలీసు సేష్టన్‌లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టు మార్టం కోసం తరలించారు. కొరాపుట్‌ నుంచి సైంటిఫిక్‌ టీమ్‌తో పాటు పోలీసు డాగ్‌ ను రప్పించి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో హహత్యకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సేకరించినటు్‌ల్‌ పోలీసులు వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement