సమగ్ర నగర గ్యాస్ పంపిణీ..
భువనేశ్వర్:
రాష్ట్ర వ్యాప్తంగా పైపుల ద్వారా వంట గ్యాసు సరఫరా వ్యవస్థ కార్యాచరణ వేగం పుంజుకునేందుకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒడిశా నగర గ్యాస్ పంపిణీ (సీజీడీ) విధానం, 2026ను గెజెట్ జారీ చేసింది. సహజ వాయువు (పీఎన్‌న్‌జీ) నెట్‌వర్క్, నగర గ్యాస్ పంపిణీ (సీజీడీ) మౌలిక సదుపాయాల అభివృద్ధి, విస్తరణను వేగవంతం చేయడం లక్ష్యంగా పేర్కొన్నారు. రాష్ట్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన అధికారిక గెజెట్‌లో ప్రచురితమైన తేదీ నుంచే ఈ కార్యాచరణ అమల్లోకి వస్తుంది. గృహ, వాణిజ్య, పారిశ్రామిక, రవాణా రంగాలకు స్వచ్ఛమైన, పర్యావరణ అనుకూల ఇంధనంగా సహజ వాయువును ప్రోత్సహించేందుకు ఈ వ్యవస్థ దోహదపడుతుంది. నిర్ధారిత కాలపరిమితితో ఆమోదిత యంత్రాంగం ద్వారా పీఎన్‌జీ కనెక్షన్లు, సీఎన్‌జీ స్టేషన్లు, సంబంధిత మౌలిక సదుపాయాల అమలును వేగవంతం అవుతుంది. ఈ విధానం ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 30 జిల్లాల్లో పైపు లైను ద్వారా గ్యాసు పంపిణీ వ్యవస్థ అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 5 సీజీడీ సంస్థలకు అధికారం కల్పించింది. నిర్ధారిత కాల పరిమితి కింద సుమారు 9 లక్షల పీఎన్‌జీ గృహ కనెక్షన్లు మరియు 271 సీఎన్‌న్‌జీ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. దీని వ్యయ అంచనా దాదాపు రూ.5,100 కోట్లు. గృహ, పట్టణాభివృద్ధి శాఖను నోడల్ శాఖగా ఈ విధానం అమలు కార్యకలాపాలు పర్యవేక్షిస్తుంది. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి అపెక్స్ కమిటీ, కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలు సీజీడీ ప్రాజెక్టుల ఏర్పాటు, కార్యాచరణకు సరళీకృత వ్యవస్థలో వేగవంతమైన అనుమతులు మంజూరు కోసం ప్రామాణిక అనుమతి రుసుములు, జీఐఎస్ ఆధారిత భూగర్భ యుటిలిటీ మ్యాపింగ్, సీఎన్‌జీ స్టేషన్లు, సిటీ గేట్ స్టేషన్లకు భూమి ప్రాధాన్యతా కేటాయింపు, భవన ప్రణాళికలు, పట్టణ మాస్టర్ ప్లాన్‌లలో పీఎన్‌జీ పైప్‌లైన్ నిబంధనలను చేర్చడం వంటి శాఖల మధ్య సమన్వయం, పర్యవేక్షణ కార్యకలాపాలు చేపడతాయి. 2027 మార్చి 31 వరకు పైప్‌లైన్ వేయడానికి అనుమతి, పర్యవేక్షణ రుసుములను రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసింది. ఈ విధానం భద్రతా ప్రమాణాలు, అత్యవసర ప్రతిస్పందన యంత్రాంగాలు, నిత్యావసర సేవలుగా పీఎన్‌జీ/సీఎన్‌జీ నిరంతరాయ సరఫరా, స్థానిక సంస్థల సహకారంతో కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) కార్యక్రమాలను ప్రోత్సహించడం వంటి అంశాలను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. ఈ విధానం రాష్ట్రంలో స్వచ్ఛ ఇంధన వ్యవస్థను బలోపేతం చేసి పట్టణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో కాలుష్యాన్ని నివారణకు దోహదపడుతంది. రాష్ట్ర వ్యాప్తంగా గణనీయమైన ఉపాధి, పెట్టుబడి అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు.


