కన్నీటి వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

కన్నీటి వీడ్కోలు

May 8 2026 1:19 PM | Updated on May 8 2026 1:19 PM

భువనేశ్వర్‌: పేద, నిస్సహాయ, గిరిజన, అణగారిన ప్రజల సహచరుడైన విశ్రాంత పాస్టర్‌ సుమన్‌ రైకా 107 ఏళ్ల వయసులో కన్ను మూశారు. ఆయన మృతిపై హై టెక్‌ గ్రూప్‌ వ్యవస్థాపక చైర్మన్‌ డాక్టర్‌ తిరుపతి పాణిగ్రాహి నివాళులర్పిస్తూ తుది వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతు దివంగత సుమన్‌ రైకా సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారన్నారు. గజపతి జిల్లాలోని కొండ, దుర్గమ ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, రవాణా అభివృద్ధికి బలమైన వారధిగా కొనసాగారు. రెకా జీవితం చిట్ట చివరి దశ వరకు సాంఘిక సేవకు అంకితం అయ్యారు. ఈ మహనీయుని మరణం ఈ ప్రాంతంలో పూడ్చలేని లోటును సృష్టించిందని ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement