రాయగడ: ముస్లింల ప్రముఖ పుణ్యక్షేత్రం హజ్‌కు రాయగడ నుంచి అన్నాచెల్లెలు బయల్దేరారు. వృద్ధులైన ఆలీ హైదర్, సర్వరీ బాను అనే వీరిద్దరు గురువారం హజ్ ప్రయాణించేందుకు స్థానిక రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. వీరి ని సాగనంపేందుకు ముస్లింలు, వారి బంధు వులు పెద్ద సంఖ్యలో వెళ్లి వీడ్కోలు చెప్పారు. గత మూడుసార్లు ఈ యాత్రను చేసి వచ్చామని భాను, ఆలీలు తెలిపారు.
నకిలీ పోలీసు అధికారి అరెస్టు
భువనేశ్వర్: పోలీసుగా నమ్మిస్తూ చలామణి అవుతున్న బూటకపు పోలీసు అధికారిని గురువారం అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా స్థానిక ఎయిర్‌ఫీల్డ్ ఠాణా పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. విచారించిన మేరకు అతడ్ని అరెస్టు చేశారు. నిందితుడు భువనేశ్వర్‌లో ఉంటున్న అభిషేక్ మిశ్రాగా గుర్తించారు. బూటకపు పోలీసు ఆధార్ కార్డు, గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకుని ఎయిర్ ఫీల్డు ఠాణా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
నబరంగ్‌పూర్‌లో బంకులు మూసివేత
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లాలో ఇంధన కొరతతో పెట్రోల్ బంకులు మూసి వేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో 6 బంకుల్లో ఇంధన నిల్వలు అడుగంటాయి. దాంతో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. కేవలం రెండు బంకులు మాత్రం నడుస్తున్నాయి. అవి కూడా ద్విచక్ర వాహనానికి రు.100, ఆటోకి రూ.200, కార్లకి రూ.400, పెద్ద వాహనాలకు రూ.1000 ఇంధనం మాత్రమే ఇస్తున్నాయి. ఈ కొరత పల్లెలపై కూడా పడింది. పట్టణాల్లో ఇంధనం దొరక్కపోవడంతో వాహనదారులు పల్లెల్లో ఉన్న బంకుల వైపు తరలివెళ్లారు.
జయపురం: గుణాత్మక విద్యను అందించాలని జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయ కులపతి హృశికేష్ సనాపతి అన్నారు.విశ్వవిద్యాలయ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం గురువారం జరిగింది. విశ్వవి ద్యాలయ సభాగృహంలో నిర్వహించిన సమావేశానికి కులపతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విద్యావిధాన రూపురేఖలు, ఇంటర్నర్‌షిప్, క్లా సుల నిర్వహణ, అధ్యాపకుల టైమ్ టేబుల్, విద్యా ర్థులు క్లాసులలో పాల్గొనే వ్యవస్థ, ప్రాక్టికల్ సిస్టం, పేరేంట్స్–అధ్యాపకుల సమావేశం, ఇంటర్నల్ మూల్యాంకనం, విద్యార్థుల ప్రవర్తన, లెసన్ ప్లాన్ తదితర విషయాలపై కౌన్సిల్ సమావేశం చర్చించింది. కులపతి మాట్లాడుతూ.. విద్యా బోధనలో అధ్యాపకులు సమన్వయనంతో వ్యవహరించాలన్నారు. ఈ సమావేశంలో పి.జి.కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ ప్రశాంతకుమార్ పాత్రో, రంజన్‌కుమార్ ప్రధాన్, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ మహేశ్వర చంద్ర నాయక్ తమ అభిప్రాయాలను వెల్లడించారు. విక్రమదేవ్ +2 కళాశాల ప్రిన్సిపాల్ కెప్టెన్ లక్ష్మణ పాత్రో, తదితరులు పాల్గొన్నారు.


