అభివృద్ధి పనులపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులపై సమీక్ష

May 7 2026 9:26 AM | Updated on May 7 2026 9:26 AM

మల్కన్‌గిరి: జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో బుధవారం రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్‌, తాగునీటి శాఖ మంత్రి రవి నారాయణ నాయక్‌ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షంచారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, పీఎం జనమన్‌, ఆదర్శ గ్రామ యోజన, బిజు పక్కా ఘర్‌ యోజన, కొత్త స్పెషల్‌ పక్కా ఘర్‌ యోజన వంటి గ్రామీణ గృహ పథకాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలని సూచించారు. సమావేశంలో నవరంగ్‌పూర్‌ ఎంపీ బలభద్ర మాఝి, కలెక్టర్‌ ప్రధమేశ్‌ అర్వింద్‌ రాజశిర్కే, మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్‌ మాడ్కామి, జిల్లా అభివృద్ధి అధికారి దశరాథి సరాభు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement