రాయగడ : స్థానిక కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో బాలాజీనగర్ కల్యాణ వేంకటేశ్వర కల్యాణ మండపంలో బుధవారం సామూహిక ఉపనయనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు కింతలి అమర్‌నాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 180 మంది యువకులు పాల్గొన్నారు. వీరందరికీ ఉచితంగా అన్ని సౌకర్యాలు కల్పించారు. ముందుగా కళింగ వైశ్యుల ఆరాధ్య దైవం కన్యకాపరమేశ్వరి చిత్రపటంతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఉపనయనాలు అనంతరం అన్న సమారాధన ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి టంకాల జయరాం, ఉపాధ్యక్షుడు ఈశ్వర గోపాల్ శెఠి, కోశాధికారి వడ్డి మురళి, సహకార్యదర్శి చిన్నారి విజయ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


