రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

May 7 2026 9:26 AM | Updated on May 7 2026 9:26 AM

రాయగడ: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. సదరు సమితి పరిధిలోని కొత్తపేట వద్ద మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో జేకేపూర్‌ ప్రాంతానికి చెందిన మేకానిక్‌ రమేష్‌ (42) ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం తెలుసుకున్న చందిలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయాలతో ఉన్న రమేష్‌ను జిల్లా కేంద్రాస్పత్రికి ఆంబులెన్స్‌లో తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం రాత్రి స్కూటీపై జేకేపూర్‌కు వెళుతున్న సమయంలో కొత్తపేట వద్ద ఎదురుగా వచ్చిన ఆటో అతనిని అదుపుతప్పి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కిందపడిపొయిన రమేష్‌ తీవ్రగాయాలకు గురై ప్రాణాలు కోల్పోయాడు.

విశ్రాంత టీచర్‌కు రెండేళ్ల జైలుశిక్ష

జయపురం: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కుట్టుమిషన్‌ ఉపాధ్యాయుడికి జయపురం స్వతంత్ర విజిలెన్స్‌ కోర్టు మంగళవారం శిక్ష విధించింది. విజిలెన్స్‌ కోర్టు జడ్జి మానసకుమార్‌ పండా కేసు విచారించారు. రాయగడ జిల్లా ఆదివాసీ డెవలప్‌మెంట్‌, సమాజ కళ్యాణ విభాగ ఉన్నత పాఠశాల విశ్రాంత టైలరింగ్‌ ఉపాధ్యాయుడు రాజేంద్రపాత్రోను దోషిగా నిర్ణయించి రెండేళ్ల జైలు శిక్ష రూ.50 వేలు జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే మరో 4 నెలలు జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు. 2023లో రాజేంద్ర పాత్రో ఆస్తులపై విజిలెన్స్‌ విభాగం దాడులు జరిపింది. అవినీతి నిరోధక చట్టం పరిధిలో పలు కేసులు పెట్టారు. కేసుల దర్యాప్తు అధికారి తాత్కాలిక విజిలెన్స్‌ డీఎస్‌పీ రంజన్‌కుమార్‌ దాస్‌ దర్యాప్తు జరిపారు. 2026లో జయపురం స్వతంత్ర విజిలెన్స్‌ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రభుత్వం తరఫున స్వతంత్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శశిభూషణ పట్నాయిక్‌, ఉదిత్‌ భట్టాచార్యలు కేసు వాదించారు.

Advertisement
 
Advertisement
Advertisement