బెల్ట్‌ దుకాణాల నిర్వాహకులపై బైండోవర్‌ | - | Sakshi
Sakshi News home page

బెల్ట్‌ దుకాణాల నిర్వాహకులపై బైండోవర్‌

May 7 2026 9:26 AM | Updated on May 7 2026 9:26 AM

పాతపట్నం: మద్యం బెల్టు దుకాణాల నిర్వాహకులపై బైండోవర్‌ కేసులు నమోదు చేసినట్లు పాతపట్నం ప్రొహిబిషన్‌, ఎకై ్సజ్‌ సీఐ కోట కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు బుధవారం పాతపట్నం మండలంలోని పాతపట్నం, ప్రహరాజపాలెం, దోమదల, జగ్గిలిబొంతు గ్రామాలకు చెందిన ఐదుగురు బెల్టుషాపు నిర్వాహకులను తహసీల్దార్‌ కార్యాలయానికి తీసుకొచ్చి, తహసీల్దార్‌ ఎన్‌.ప్రసాదరావుతో బైండోవర్‌ నమోదు చేశారు. ప్రజారోగ్యానికి హానిచేసే నాటుసారా అమ్మకాలు చేయడం గానీ, బెల్టు దుకాణాలను నిర్వహించడం చట్టరీత్యా నేరమన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక నుంచి సత్ప్రవర్తన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఏడాది పాటు బైండోవర్‌ ఉంటున్న నేపథ్యంలో మరలా బెల్టు షాపులు నిర్వహంచినా, నాటుసారా అమ్మకం చేస్తున్నట్లు తెలిసినా రూ.2 లక్షలు జరిమానా వేస్తామని సీఐ కృష్ణారావు హెచ్చరించారు. ఎకై ్సస్‌ కానిస్టేబుల్స్‌ శివకుమార్‌, కల్పన పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement