మల్కన్‌గిరి: పది ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ ప్రథమేశ్ అర్వింద్ రాజశిర్కే బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. 32 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. 22 మంది 90 శాతం పైగా మార్కులు పొందడంతోపాటుగా కాలుతో పరీక్ష రాసిన లక్ష్మీ ఖేముండుకి కలెక్టర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. సంకల్పమే ఆమె ధర్యంతో ముందడుగు వేసింది. చేతులు పని చేయక కాలుతో పరిక్ష రాసి 66 శాతం మార్కులు సాధించింది. ఆమె కాలేజీ చదువుకు ప్రభుత్వ సహాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కర్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్ , జిల్లా వైద్యాధికారి బోజా, జిల్లా విద్యశాఖాధికారి చిత్తరంజాన్ పాణిగ్రాహి, జిల్లా అభివృద్ధిశాఖ అధికారి దశరథి సరబు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


