ఉద్దాన రైతుల జీవనాధారమైన పంటల్లో ఒకటైన పనస పంటకు ప్రస్తుతం ధర లేకపోవడంతో పంట రోడ్డు పాలవుతోంది. ఇతర రాష్ట్రాల్లో సైతం ఎంతో ఆదరణ ఉన్న ఈ పంట సీజన్ ప్రారంభంలో కేజీ ధర అత్యధికంగా రూ.25లు పలికింది. తర్వాత కాయ సైజు ఆధారంగా కేజీ రూ.15ల నుంచి రూ.16లకు వ్యాపారులు కొనుగోలు చేశారని రైతులు తెలిపారు. అయితే ప్రస్తుతం పసన కాయలకు గిరాకీ పూర్తిగా తగ్గడంతో పాటు వర్షాలు కురవడంతో కాయ నాణ్యత తగ్గిందని వ్యాపారులు కొనని పరిస్థితి నెలకొంది. దీంతో చెట్టు మీద కాయలను తొలగించిన రైతులు, వాటిని అమ్మలేక పలు ప్రాంతాల్లో రోడ్డుపైనే పడేస్తున్నారు. బెండి గేటు, బెండి, సీతాపురం, పెద్దబొడ్డపాడు, కొండవూరు గ్రామాల రోడ్లపై కాయలు పడివేయడంతో ఆయా గ్రామాల ప్రజలు కాయలను మోసుకెళ్తున్నారు. ఈ ఏడాది పనస ధర దారుణంగా పతనం కావడంతో నష్టపోయామని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. – వజ్రపుకొత్తూరు రూరల్


