శ్రీకాకుళం కల్చరల్: భగవాన్ సత్యసాయి బాబా మాతృమూర్తి ఈశ్వరాంబ వర్ధంతి సందర్భంగా బాలవికాస్ పిల్లలు, గురువులతో జిల్లాలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న వేడుకలు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సూర రామచంద్రరావు ఆధ్వర్యంలో పీఎన్ కాలనీలోని సత్యసాయి భజన మందిరం ఆధ్వర్యంలో బాలవికాస్ చిన్నారులతో ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక, సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు పూర్ణాహుతితో పూర్తి చేసినట్లు తెలియజేశారు. సోంపేట, పలాస, పాతపట్నం, హిరమండలం, టెక్కలి, నరసన్నపేట, ఆమదాలవలస, గార, శ్రీకాకుళం మొత్తం తొమ్మిది జోన్లలో బాలవికాస్ చిన్నారులతో వివిధ సేవా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. కార్యక్రమాల్లో జిల్లా పదాధికారులు పప్పల నాగేశ్వరరావు, బోయిన నరసింహమూర్తి, శశికాంత్, లాడి చంద్రశేఖర్, శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.


