కొత్తూరు:
గిరిజన సమస్యలను అధికారులు సకాలంలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని సీతంపేట ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్ అన్నారు. మండలంలోని ఓండ్రుజోల గ్రామంలో గిరిజనులతో మాటామంతీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. గిరిజనులు పడుతున్న పలు రకాల సమలస్యలను పీఓకు వివరించారు. భూ సమస్యలు, రహదారులు, తాగునీరు వంటి సమ్యలు పరిష్కరించాలని కోరారు. పీఓ మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కరించేందుకు ఆధారాలతో కూడిన దరఖాస్తులను రెవెన్యూ అధికారులకు అందజేయాలన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం మండల పరిషత్ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రహదారులకు నిధులు కేటాయించి, చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజనులకు సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సామాజిక వెత్త బామిడి రాజు, సుందర నారాయణ, తిరుపతిరావు, సచివాలయ ఉద్యోగులు, గిరిజనులు పాల్గొన్నారు.


