మందస: బాలిగాం సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కాశీబుగ్గ, కోట బొమ్మాళికి చెందిన టి.శ్రీనివాసరావు, ఎన్.ధనలక్ష్మి బంధువులు. మందస మండలం సొండిపూడి గ్రామంలో బంధువుల ఇంట్లో వివాహ వేడుకకు హాజరై తిరిగి బైక్ వస్తుండగా బాలిగాం జాతీయ రహదారిపై కోళ్లు రవాణా చేస్తున్నా బొలెరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాసరావు, ధనలక్ష్మిలు తీవ్రంగా గాయపడటంతో సమీపంలోని హరిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మందస ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్ తెలిపారు.
సూర్యనారాయణ నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్ : హయాతినగరానికి చెందిన ముగుల సూర్యనారాయణ (85) మృతి చెందడంతో ఆయన నేత్రాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ఫణికిరణ్ తదితరులు నిర్ణయించారు. విషయాన్ని రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావుకు తెలియజేయడంతో మగటపల్లి కల్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం సిబ్బంది పి.సుజాత, ఎం.ఉమాశంకర్‌లు కార్నియాలను సేకరించి విశాఖపట్నం తరలించారు.


