బాల్య వివాహం అడ్డగింత | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహం అడ్డగింత

May 5 2026 6:56 AM | Updated on May 5 2026 6:56 AM

పర్లాకిమిడి: గజపతి జిల్లా గుమ్మాబ్లాక్‌ పోరిడా పంచాయతీ పోరిడా గ్రామంలో సోమవారం ఒక బాల్య వివాహం జరుగుతున్న సమాచారం చైల్డ్‌ హెల్ప్‌లైన్‌కు అందగా, వెంటనే వారు జిల్లా శిశు సురక్షా సమితి అధికారులకు తెలియజేశారు. దీంతో వెంటనే జిల్లా శిశు సురక్షా సమితి, ఐసీడీఎస్‌, చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అధికారి, సెరంగో, గైబ పోలీసు అధికారులు, సఖీ వన్‌స్టాప్‌ సెంటర్‌ అధికార బృందం వివాహం జరుగుతున్న గైబ గ్రామానికి చేరుకుని నిలుపుదల చేశారు. వధువుకు 18 ఏళ్ల కంటే తక్కువ ఉందని తెలిసి వివాహ వేదిక నుంచి పురోహితుడు వెళ్లిపోవడం అధికారులను ఆశ్చర్యపరిచింది. అనంతరం జిల్లా స్క్వాడ్‌ పెళ్లికూతురు తల్లిదండ్రులకు బాల్యవివాహ నిరోధక చట్టం, జరిమానా వంటి ప్రభుత్వ నియమాలని పెళ్లి వారికి వివరించి బాల్య వివాహాన్ని రద్దు చేయించారు.

Advertisement
 
Advertisement
Advertisement