త్వరితగతిన సమస్యల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

త్వరితగతిన సమస్యల పరిష్కారం

May 5 2026 6:56 AM | Updated on May 5 2026 6:56 AM

● అధికారులకు ఆదేశించిన కలెక్టర్‌ స్వల్ప వర్షానికే ఇళ్లలోకి నీరు

● అధికారులకు ఆదేశించిన కలెక్టర్‌

కులకర్ణి

రాయగడ: ప్రజల నుంచి స్వీకరించిన అభియోగాలు, సమస్యలకు సంబంధించి వాటిని పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ అశుతోష్‌ కులకర్ణి సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు. స్థానిక డీఆర్‌డీఏ సమావేశం హాల్‌లో సోమవారం నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో ఎస్పీ స్వాతి ఎస్‌ కుమార్‌, జిల్లా పరిషత్‌ ముఖ్యకార్య నిర్వాహక అధికారి అక్షయ కుమార్‌ ఖెముండో, డీఎఫ్‌వో సచీన్‌ అన్నాసాహెబ్‌ అహాలే, జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్‌ ప్రశాంత మిశ్రో, ఐటీడీఏ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌ చంద్రకాంత్‌ మాఝి, సబ్‌ కలెక్టర్‌ రమేష్‌ కుమార్‌ జెన్న, వివిధశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ దృష్టికి 41 వినతులు అందాయి. ఇందులో 31 వ్యక్తిగత, ఆరు సామూహిక గ్రామ సమస్యలుగా అధికారులు గుర్తించారు. రెడ్‌ క్రాస్‌ నిధుల నుంచి కలెక్టర్‌ నలుగురుకి 40 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.

మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితిలో సోమవారం సాయంత్రం కురిసిన కొద్దిపాటి వర్షానికే ఇళ్లలోకి నీరు చేరింది. సమితి కేంద్రానికి వంద మీటర్ల దూరంలో ఉన్న ఈపీడీపీ కాలనీలోని ఇళ్లలో నీరు చేరిపోయాయి. రహదారి, ఇళ్ల ముందు ద్వారాల వరకు నీరు వచ్చింది. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement