మల్కన్‌గిరి:
జిల్లాలోని కలిమెల సమితి లుగెల్ పంచాయతీ కార్యాలయంలో కలెక్టర్ ప్రథమేశ్ అర్వింద్ రాజశిర్కే గ్రీవెన్స్‌ను సోమవారం నిర్వహించారు. దీనిలో భాగంగా మొత్తం 61 వినతులు స్వీకరించారు. 23 పంచాయతీలకు చెందిన గిరిజనులు తమ సమస్యలపై వినతులు అందజేశారు. కొన్ని సమస్యలకు వెంటనే అధికారులు పరిష్కారం చూపారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి, కలిమెల అదనపు తహసీల్దార్ రాజీవ్ బెహరా, జిల్లా విద్యాధికారి చిత్తరంజాన్ పాణిగ్రహి, ఏసీఎఫ్ ప్రియాంక మహుకా, డీడబ్ల్యూవో శ్రీనివాస్ ఆచారి, మోటు ఐఐసీ అర్జున్ కహార్ తదితరులు పాల్గొన్నారు.


