క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

May 5 2026 6:56 AM | Updated on May 5 2026 6:56 AM

జయపురం: సబ్‌ డివిజన్‌లోని బొయిపరిగుడ సమితి ముండాగుడ గ్రామంలో క్రికెట్‌ టోర్నమెంట్‌ సోమవారం ప్రారంభమైంది. మా హుండీ ఠకురాణి క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రముఖ క్రీడాకారుడు పింటు పాణిగ్రహి ప్రారంభించారు. గౌరవ అతిథులుగా ఉపాధ్యాయుడు నిర్మల కుమార్‌ స్వైయ్‌, కృష్ణశాంత, నోరొ గౌడ, జనార్ధన నాయిక్‌, రామచంద్ర నాయిక్‌, రామచంద్ర గౌఢ, డొంబురు కర్లియలు హాజరయ్యారు. టోర్నమెంట్‌లో 16 టీములు పాల్గొంటున్నాయని నిర్వాహకులు వెల్లడించారు. జిలిమిలిగుడ లెవెన్‌, బొయిపరిగుడ–ఎ లెవెన్‌ టీమ్‌లు మొదటి మ్యాచ్‌లో తలపడగా.. జిలిమిలిగుడ లెవెన్‌ టీమ్‌ విజయం సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement