రాయగడ: జిల్లాలోని పద్మపూర్‌లో భైరవ సాహు అనే వ్యక్తి చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో అమానుషంగా హత్య చేసిన నలుగురు నిందితులు కోర్టు సమక్షంలో లొంగిపోవాలని నిందితుల ఇంటి ముందు నోటీసులు అతికించారు. ఈ మేరకు కోర్టు ఆదేశించిన మేరకు సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. గతేడాది పద్మపూర్‌లో చోటు చేసుకున్న ఈ హత్య కేసుకు సంబంధించి నిందితులుగా అదే ప్రాంతానికి చెందిన సుశాంత సాహు, ప్రశాంత సాహు, సునీల్ సాహు, ప్రశాంత్ కుమార్ సాహులను గుర్తించారు. అయితే వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు కోర్టు సమక్షంలో తెలియజేశారు. ఈ మేరకు శనివారం కేసు విచారించిన కోర్టు నిందితులు జూన్ 18వ తేదీలోగా కోర్టు ఎదుట హాజరవ్వాలని ఆదేశించింది. లేనిపక్షంలో నిందితులపై ఆస్తులను జప్తుచేసే అవకాశం ఉందని నోటీసులో పేర్కొంది.


