పర్లాకిమిడి: స్థానిక కోమటివీధిలో కోనసాగుతున్న నీలమ్మ దేవి గ్రామ దేవత అమ్మవారి పండుగల్లో భాగంగా సోమవారం అమ్మవారి సన్నిధానంలో లక్ష్మీ హోమం, మృత్యుంజయ హామం శాస్త్రోక్తంగా జరిపించారు. మొత్తం 42 మంది దంపతులు ఈ హోమాల్లో కూర్చున్నారు. కార్యక్రమాన్ని పండితులు ఎ.రాజగోపాలచారి ఆధ్వర్యంలో జరిపించారు. అమ్మవారి సంబరాల పండుగ కమిటీ సభ్యులు సహకరించారు. సాయంత్రం వివిధ దుర్గా అవతారాల్లో రామభద్రపురానికి చెందిన కళాకారులు శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ అమ్మవారి సంబరాలు చూడటానికి పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి విచ్చేశారు.


