టాపర్‌కు సత్కారం | - | Sakshi
Sakshi News home page

టాపర్‌కు సత్కారం

May 5 2026 6:32 AM | Updated on May 5 2026 6:32 AM

టాపర్‌కు సత్కారం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందన ఐటీడీఏ బంకులో పెట్రోల్‌ కొరత కదలని ఏనుగులు ఆయుష్‌ మెడికల్‌ క్యాంప్‌ ప్రారంభం

పర్లాకిమిడి: ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో జిల్లాలోని గుసాని సమితి బుసుకిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని గుర్రం చేతనకు 550/600 వచ్చి ఏ1 గ్రేడ్‌ సాధించినందుకు పాతపట్నానికి చెందిన పారశెల్లి రామరా జు చారిటబుల్‌ ట్రస్టు పర్లాకిమిడిలో ఆమె నివాసంలో ఘనంగా సత్కరించారు. జి.చేతనకు మె మెంటో, నగదు పురస్కారాన్ని పి.రామరాజు అందజేశారు. విద్యార్థిని తల్లిదండ్రులు గుర్రం గోవిందరాజు, కోమలి దంపతులకు ట్రస్టు తరఫున ఘనంగా సన్మానించారు. జి.చేతన తండ్రి బుసుకిడి ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ తన కూతుర్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించడం అభినందనీయనం అన్ని పారశెల్లి రామరాజు అన్నారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు భీమసేన్‌పండా, విశ్రాంత ఐ.టి.డి.ఏ.అధికారి జనార్ధనరావు ఇతర ఉపాధ్యాయులు ఉన్నారు.

రాయగడ: ఇటీవల ప్రకటించిన మెట్రిక్‌ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన ఆరుగురు విద్యార్థులను జిల్లా కలెక్టర్‌ అశుతోష్‌ కులకర్ణి సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. వారికి పుష్పగుచ్ఛాలతో పాటు ప్రశంసా పత్రాలను అందించారు. భవిష్యత్‌ ఉజ్వలంగా మారాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భజన్‌లాల్‌ మఝి తదితరులు ఉన్నారు.

మెట్లపై నుంచి జారిపడి వ్యక్తి మృతి

సీతంపేట: మండలంలోని జి.గుమ్మడ గ్రామానికి చెందిన ఆరిక సోమయ్య (63) అనే వృద్ధు డు మెట్లపై నుంచి జారిపడి శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు దోనుబాయి ఏఎస్సై త్రినాథరావు తెలి పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం వర్షం కురుస్తున్న సమయంలో ఇంటి మెట్లు ఎక్కుతుండగా జారి పడడంతో సోమ య్య తలకు బలమైన గాయమైందన్నారు. దీంతో స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేర్పించి ప్రథ మ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు చెప్పారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.

సీతంపేట: స్థానికంగా నిర్వహిస్తున్న ఐటీడీఏ పెట్రోల్‌ బంకులో సోమవారం పెట్రోల్‌ కొరత ఏర్పడింది. దీంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. సోమవారం వారపు సంత కావడంతో ఎక్కువ మంది వాహనదారులు సీతంపేటకు రావడం, పెట్రోల్‌ బంకులో పెట్రోల్‌ లేకపోవడంతో బయట మార్కెట్‌లో కొనుగో లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు తెలియజేశారు.

గరుగుబిల్లి: ఏనుగుల సంచారంతో ప్రజలు భీతిల్లుతున్నారు. మండలంలోని నందివానివలసలో తామరచెరువు, పంటపొలాల్లో సంచరించిన ఏనుగులు సోమవారం సుంకి గ్రామ పరిసరాల్లోని నాగావళినది ప్రాంతంలో గల పంప్‌హౌస్‌ పరిసరాల్లో సంచరిస్తున్నాయి. కొద్ది రోజులనుంచి ఈ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తుండడంతో ఎప్పుడు ఏ గ్రామంలో చొరబడి ఎవరికి హాని కలగజేస్తాయోనని రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వేసవి పంటలు ఉండడంతో రైతులు పొలం పనులు చేపట్టేటప్పుడు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భీతిల్లుతున్నారు. ఏనుగులను తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఏనుగులను తరలించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్‌లో ఆయుష్‌ విభాగం ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌ రెడ్డితో కలిసి కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి, సోమవారం ప్రారంభించారు. ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో ఈ శిబిరం నిర్వహిస్తారని, ఒక వారం ఆయుర్వేదం, మరో వారం హోమియోపతి సేవలు అందిస్తారని తెలిపారు. ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెంపు లక్ష్యమని పేర్కొన్నా రు. డీఎంహెచ్‌ఓ భాస్కరరావు, జిల్లా ఎన్‌సీడీ అధికారి డా.జగన్‌మోహన్‌రావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement