కళ్యాణసింగుపూర్‌ ల్యాంప్‌ డైరెక్టర్‌ సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

కళ్యాణసింగుపూర్‌ ల్యాంప్‌ డైరెక్టర్‌ సస్పెన్షన్‌

May 5 2026 6:32 AM | Updated on May 5 2026 6:32 AM

కళ్యాణసింగుపూర్‌ ల్యాంప్‌ డైరెక్టర్‌ సస్పెన్షన్‌

రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్‌ ల్యాంప్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ తరణీ ప్రసాద్‌ త్రిపాఠిపై సస్పెన్సన్‌ వేటు పడింది. ల్యాంప్స్‌కు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణపై జిల్లా కలెక్టర్‌ అశుతోష్‌ కులకర్ణి ఆదేశానుసారం డిప్యూటీ రెజిస్ట్రార్‌ ఆఫ్‌ కోపరేటీవ్‌ సొసైటీ (డీఆర్‌సీఎస్‌) జన్మజయ్‌ మహాపాత్రో, జి.కృష్ణమూర్తిలు ఈ మేర కు ల్యాంప్స్‌ కార్యాలయంపై ఆకస్మిక దాడులను నిర్వహించారు. దాడుల్లో భాగంగా అన్ని దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాధమిక దర్యాప్తు అనంతరం ల్యాంప్స్‌ ఎండీ త్రిపాఠిని సస్పెండ్‌ చేస్తున్న ట్లు ఉత్వర్యులు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు తన వ్యక్తిగత పేరుమీద, బంధు వు పేరుమీద సుమారు 75 లక్షల రూపాయల వర కు స్వాహా చేసినట్లు దర్యాప్తులో తేలిందని అధికారు లు వెల్లడించారు. ల్యాంప్స్‌కు సంబంధించి వివిధ పనుల పేరిట తప్పుడు లెక్కలు చూపించి నిధులు దుర్వినియోగం చేసినట్లు సమాచారం. దర్యాప్తు పూర్తయితే మరిన్ని వివరాలు తెలుస్తాయని డీఆర్‌సీఎస్‌ జన్మజయ్‌ మహాపాత్రో తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement