గ్రీవెన్స్‌సెల్‌కు 67 వినతులు | - | Sakshi
Sakshi News home page

గ్రీవెన్స్‌సెల్‌కు 67 వినతులు

May 5 2026 6:32 AM | Updated on May 5 2026 6:32 AM

గ్రీవెన్స్‌సెల్‌కు 67 వినతులు

జయపురం: జయపురం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు 67 వినతులు అందాయి. జిల్లా కలెక్టర్‌ మనోజ్‌ సత్యబా న్‌ మహాజన్‌ అధ్యక్షతన వినతులు స్వీకరించారు. వీటిలో 11 కమ్యూనిటీ వినతులు కాగా 56 వ్యక్తిగత వినతులని అధికారులు వెల్లడించారు. వీటిని పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. కార్య క్రమంలో కొరాపుట్‌ జిల్లా పోలీసు అధికారి రోహిత్‌ వర్మ, కొరాపుట్‌ జిల్లా పరిషత్‌ కార్యనిర్వాహక అధి కారి వేణుదర్‌ శబర, జయపురం సబ్‌కలెక్టర్‌, జాదుమణి నాయిక్‌, జయపురం సబ్‌డివిజనల్‌ పోలీసు అధికారి అర్చిత మిత్తల్‌, జిల్లా ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ రభీంద్రనాథ్‌, ఐటీడీఏ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌ తృప్తి బొరాయి, జయపురం సమితి బీడీవో శక్తి మహాపాత్రో, జయపురం తహసీల్దార్‌ సవ్యసాచి బెహర, జిల్లా విద్యాధికారి ప్రశాంతకుమార్‌ మహంతి, జయపురం బ్లాక్‌ అధికారి చందన కుమా ర్‌ నాయిక్‌, శిశు వికాశ్‌ విభాగ అధికారి సంగీత రాణి పాణి, ఆర్టీసీ అధికారి, ఆర్‌అండ్‌బీ అధికారి ప్రియరంజన్‌ బెహర ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement