చరిత్రను మర్చిపోవద్దు | - | Sakshi
Sakshi News home page

చరిత్రను మర్చిపోవద్దు

May 4 2026 10:13 AM | Updated on May 4 2026 10:13 AM

వంశధార రెండో దశ నిర్మాణంలో తమ్మినేని సీతారాంది కీలక పాత్ర

కేంద్ర మంత్రిది క్రెడిట్‌ చోరీ

వైఎస్సార్‌ సీసీ యువజన విభాగం నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్‌

ఆమదాలవలస: వంశధార రెండో దశ నిర్మాణ పనుల సాధనలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన తమ్మినేని సీతారాం ప్రధాన పాత్ర పోషించారని వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్‌ స్పష్టం చేశా రు. ఆయన ఆదివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. వంశధార ప్రాజెక్ట్‌ చరిత్రను రాజకీయ కోణంలో కాకుండా వాస్తవాల ఆధారంగా చూడాలని కోరారు. 1961లో బొడ్డేపల్లి రాజగోపాలరావు ఆలోచనతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌కు అదే సంవత్సరం దామోదరం సంజీవయ్య శంకుస్థాపన చేయగా, ఇచ్ఛాపురం వరకు సాగునీరు అందించాలనే లక్ష్యం అప్పుడే నిర్ణయించారని గుర్తుచేశారు. తర్వాతి కాలంలో ఒడిశా అభ్యంతరాల కార ణంగా ప్రాజెక్ట్‌ దశాబ్దాల పాటు నిలిచిపోయిందని, 2010లో ఏర్పాటు చేసిన వంశధార జల వివాదాల ట్రిబ్యునల్‌ 2017 సెప్టెంబర్‌ 13న ఇచ్చిన తుది తీర్పుతో ప్రాజెక్ట్‌కు చట్టబద్ధ మార్గం ఏర్పడిందన్నా రు. ఆ తీర్పు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు నేరడి బ్యారే జ్‌ నిర్మాణానికి అనుమతి లభించినప్పటికీ, ఒడిశా లో 106 ఎకరాల భూసేకరణ, పునరావాసం వంటి షరతులు అమలు చేయాల్సి ఉందని వివరించారు. 2019 తర్వాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒడిశాలో భూసేకరణ కోసం రూ.100 కోట్లకు పైగా నిధులు డిపాజిట్‌ చేయడం, న్యాయపరమైన అడ్డంకులను తొలగించే చర్యలు చేపట్టడం వంటి కీలక నిర్ణయా లు తీసుకుందని గుర్తు చేశారు. అయినప్పటికీ ఒడి శా నుంచి భూమి అప్పగింతలో ఆలస్యం కారణంగా 2026 నాటికి నేరడి బ్యారేజ్‌ నిర్మాణం ప్రారంభం కాలేదని తెలిపారు.

వంశధార రెండో దశ సాధనలో తమ్మినేని సీతారాం కృషి మర్చిపోలేనిదని చిరంజీవినాగ్‌ తెలపారు. కేంద్రంలో జనతాదళ్‌ ప్రభుత్వం ఉన్న సమయంలో, అప్పటి ప్రధానమంత్రి వీపీ సింగ్‌, జలవనరుల శా ఖ మంత్రి మునుభాయ్‌ కొటాడియా తదితరులను కలిసి, ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు సూచనల మేరకు తమ్మినేని సీతారాం నేతృత్వంలో చౌదరి తేజేశ్వరరావు, తమ్మినేని శ్యామల రావు, బలగ అప్పలనాయుడు, మొదలవలస రామమూర్తి తది తరులతో కూడిన అఖిలపక్ష ప్రతినిధి బృందం వినతి పత్రం సమర్పించిందని గుర్తుచేశారు. అదేవిధంగా అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు, ఒడిశా ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్‌ల మధ్య ఉన్న స్నేహ సంబంధాల నేపథ్యంలో వంశధార రెండో దశ పనులకు కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి పచ్చజెండా ఊపిందన్నారు. అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య వి వాదాలు తలెత్తడంతో అంశం ట్రిబ్యునల్‌, న్యాయస్థానాల వరకు వెళ్లినా, చివరికి రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగే విధంగా పరిష్కార మార్గం ఏర్పడిందని వివరించారు. ఇలాంటి చారిత్రక వాస్తవాలను విస్మరిస్తూ కొందరు నాయకులు ప్రాజెక్ట్‌ క్రెడిట్‌ తీసుకునే ప్రయత్నం చేయడం సరికాదని ఆయన విమర్శించారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని అన్నా రు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఒడిశాలో భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, నేరడి బ్యారేజ్‌ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement