● 50 కిలోల బస్తాలో రెండు నుంచి ఐదు కిలోల తగ్గుదల
● ప్రతి నెలా ఇదే తంతు
● ఫిర్యాదులు చేస్తున్న డీలర్లు
● పట్టించుకోని అధికారులు
కిలోల పేరుతో డీలర్లు కార్డుదారులకు సర్దుబాటు చేస్తున్నారు. అంతిమంగా ఇది కార్డుదారులకు నష్టం చేకూరుస్తోంది.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 1603 రేషన్ డిపోల పరిధిలో 6,60,884 రేషన్‌కార్డులు ఉన్నాయి. ఇందులో కుటుంబసభ్యులు 19,51,094 మంది ఉన్నారు. ప్రతి నెలా 9,599.306 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతుంటుంది. దాదాపు ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎల్‌ఎస్ పాయింట్ ఉంది. అక్కడ పౌరసరఫరాల శాఖ గోదాముల నుంచి బియ్యం సరఫరా అవుతుంటుంది. అక్కడ డిప్యూటీ తహశీల్దారు స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుంది. కానీ ఈ తరుగు బియ్యానికి మాత్రం చెక్ పడటం లేదు. వైఎస్సార్‌సీపీ హయాంలో రేషన్ బియ్యం సరఫరా పారదర్శకంగా జరిగేది. ఇంటింటికీ రేషన్ సక్రమంగా అందించేవారు. అది కూడా కార్డుదారుల ఎదుట తూకం వేసి ఇచ్చేవారు. ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పటికై నా రేషన్ బియ్యంలో తరుగు లేకుండా చూడాలని రేషన్ డీలర్లతో పాటు సామాన్య ప్రజలు కోరుతున్నారు.
రేషన్ బియ్యం విషయంలో రాజీ లేదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యహరిస్తే చర్యలు తప్పవు. ఎక్కడైనా బియ్యంలో తరుగు వస్తే వెంటనే కార్యాలయానికి ఫిర్యాదు చేయాలి. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తాం.
– కె.బాలకృష్ణ,
తహశీల్దారు, హిరమండలం
హిరమండలం : జిల్లాలో రేషన్ డిపోలకు అందజేసే బియ్యం బస్తాల్లో తరుగు కనిపిస్తోంది. పౌరసరఫరాల శాఖ గోదాంల నుంచి డీలర్ల వద్దకు వచ్చేసరికి 50 కిలోల బియ్యం బస్తా వద్ద 2 నుంచి 5 కిలోల వరకు తరుగు వస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో 5 కిలోలు దాటుతోందని డీలర్లు లబోదిబోమంటున్నారు. ప్రతి నెలా ఏదో ఒక మండలంలో ఈ సమస్యపై డీలర్లు అధికారులకు వినతిపత్రాలు అందిస్తూనే ఉన్నారు. అయినా సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. అసలు పౌరసరఫరాల శాఖ గోదాముల వద్దకు వచ్చేసరికి ఈ వ్యత్యాసం ఉంటుందా? లేకుంటే వచ్చాక పక్కదారి పట్టిస్తున్నారా? అనే విషయంపై స్పష్టత రావడం లేదు. కానీ జిల్లా వ్యాప్తంగా ఈ బియ్యం గోల్‌మాల్ జరిగినట్టు ఫిర్యాదులు వస్తున్నాయి.
గోనె సంచి బరువుకు..
సాధారణంగా గోనె సంచి బరువు 580 గ్రాములు ఉంటుంది. అదనంగా అర కిలో బియ్యం బస్తాల్లో అందించాలి. కానీ 2 నుంచి 5 కిలోలు తగ్గించి ఇస్తున్నారు. లెవీలో మరపెట్టిన బియ్యం ఇండెంట్ ప్రకారం పౌరసరఫరాల శాఖ గోదాముకు చేర్చుతారు. అక్కడి నుంచి డీలర్లు బియ్యం విడిపించి తీసుకెళుతుంటారు. కానీ ప్రతినెలా ఈ తరుగు సమస్య వెంటాడుతునే ఉంటోంది. 50 కిలోల బస్తాలో గన్నీ సంచి బరువు 580 గ్రాములు పోను 49.420 కిలోల బియ్యం ఉండాలి. కానీ అలా ఉండటం లేదు. చాలావరకూ డిపోలకు 47 కిలోల బరువు ఉన్న బియ్యం వస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభావం కార్డుదారులపై పడుతోంది. ఇలా తరుగు వస్తుండడంతో అదే బియ్యాన్ని 50


