జయపురం: వ్యవసాయ విభాగ అధికారులు పట్టణంలోని రసాయినిక ఎరువుల దుకాణాలు, వేర్ హౌస్‌లపై మంగళవారం దాడులు నిర్వహించారు. ఎరువులు సక్రమంగా లభించటం లేదని రైతుల ఆరోపణల నేపథ్యంలో రెండు ప్రభుత్వ వేర్ హౌస్‌లు, మూడు ప్రైవేట్ ఎరువుల దుకాణాలపై దాడులు జరిపిన అధికారులు ఎరువుల నిల్వలు పరిశీలించి రికార్డులు సరిచూశారు. ముఖ్యంగా యూరియాను నిబంధనల మేరకు అమ్ముతున్నారా లేదా తెలుసుకున్నారు. దాడుల్లో సీడీఏలో సంతోష్ కుమార్ దళబెహర, జిల్లా వ్యవసాయ విభాగ అధికారి లలితేందు మహాపాత్ర, ఏడీఏ కనూచరణ దాస్, జయపురం సమితి అగ్రికల్చర్ అధికారి ిశితికాంత దాస్, అసిస్టెంట్ అగ్రి కల్చర్ ఆఫీసర్ ప్రశాంత పుష్టి, శ్మిత పాఢీ పాల్గొన్నారు.


