శ్రమదానంతో బావి నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

శ్రమదానంతో బావి నిర్మాణం

Apr 8 2026 7:32 AM | Updated on Apr 8 2026 7:32 AM

శ్రమదానంతో బావి నిర్మాణం

తాగునీటి సమస్యను పరిష్కరించుకున్న టికరపడ గ్రామస్తులు

రాయగడ: తాగునీటి సమస్యను పరిష్కరించండి మహాప్రభో అంటూ ఇటు పంచాయతీ కార్యాలయం అధికారులకు అటు సంబంధిత శాఖ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. విసిగిపోయిన సమస్యను తామే పరిష్కరించుకోవాలని గ్రామస్తులంతా ఏకమయ్యారు. శ్రమదానంతో సమీపంలో బావి నిర్మించుకున్నారు. బావి నుండి నీటిని పైపుల సహాయంతో గ్రామానికి తరలించి సమస్యను పరిష్కరించుకున్నారు. ఎవరో వస్తారని ఎదురు చూడకుండా తామే తమ సమస్యను పరిష్కరించుకున్నామని గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కాసీపూర్‌ సమితి హడియా పంచాయతీలోని టికరపడ గ్రామంలో కొన్నాళ్లుగా తాగునీటి సమస్య నెలకుంది. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఎవ్వరూ స్పందించకపొవడంతో గ్రామస్తులంతా కలసి కొంత మేర డబ్బులు పొగు చేసుకుని శ్రమదానంతో బావిని తవ్వుకున్నారు. పిల్లా.. పెద్ద, ఆడమగా అనే తేడా లేకుండా అంతా కలసి శ్రమించారు. వారం రోజుల్లో బావిని తవ్వుకున్నారు. గ్రామంలో ఇంటింటా సేకరించిన డబ్బులతో బావి నుంచి గ్రామం వరకు తాగునీటి పైపులను, మోటారును ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 30 కుటుంబాలు గల ఈ గ్రామస్తులు తమ ఐక్యతను చాటుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement