పర్లాకిమిడి: ఒడిశా దినోత్సవ పక్షోత్సవాలు పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతి విభాగం తరపున మంగళవారం స్థానిక గాంధీ మెమోరియల్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు మధుసూదన్‌రావు రాసిన ‘బొర్నోబోధో’(ఒడియాభాష వాచకం) పుస్తకాలను అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఒడియా వాచకం ఒకటి, రెండవ తరగతి విద్యార్థులకు పంపిణీ చేస్తారు. ప్రాథమిక స్థాయి నుంచి ఒడియా భాషను ప్రతిఒక్క విద్యార్థి నేర్చుకోవాలని ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏడీఎం మునీంద్ర హానగ అన్నారు. కార్యక్రమంలో డీఈవో డాక్టర్ మయాధర్ సాహు, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్, ప్రధాన ఉపాధ్యాయులు ఎస్.తిరుపతిరావు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.


