నా కుమారుడి ఆచూకీ తెలపండి! | - | Sakshi
Sakshi News home page

నా కుమారుడి ఆచూకీ తెలపండి!

Apr 8 2026 7:32 AM | Updated on Apr 8 2026 7:32 AM

రాయగడ:

నా కుమారుడి ఆచూకీ తెలపండని ఓ విద్యార్థి తండ్రి మోర పెట్టుకున్నారు. ఈ ఘటన స్థానిక అంబాగుడ గ్రామంలో గల ఆర్‌డబ్ల్యూ ఎస్‌అండ్‌ఎస్‌ పాఠశాలలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని టికిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల మయిలిగుడ గ్రామానికి చెందిన సాలు మాఝి కుమారుడు ప్రకాష్‌ మాఝి పదో తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు చెందిన హాస్టల్‌లో ఉంటున్నాడు. ప్రకాష్‌ గత 14 రోజులుగా ఇంటికి రాలేదని ఆందోళన చెందిన విద్యార్థి తండ్రి ఈ మేరకు పాఠశాల హెచ్‌ఎం బిభూతి భూషన్‌ రొథొను కలిశారు. ఇదివరకే తాను ఇంటికి వెళ్తున్నట్లు హాస్టల్‌ వార్డెన్‌కు చెప్పి ప్రకాష్‌ వెళ్లిపోయాడని హెచ్‌ఎం సమాధానం ఇచ్చారు.

ఇదిలా ఉండగా మార్చి 27వ తేదీన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం ఉందని అందరికీ ఫోన్‌ ద్వారా మెసేజ్‌లు పంపించడం జరిగిందని, ఆ సమయంలో సమావేశానికి రాకపొవడంతో ఏదో కారణంతో రాలేదని భావించామని హెచ్‌ఎం సమాధానం చెప్పాడు. గత 14 రోజులుగా తన కుమారుడు ఇంటికి రాలేదని, పాఠశాలలో లేడని, ఎక్కడికి వెళ్లినట్లని విద్యార్థి తండ్రి బోరుమన్నాడు. ఈ విషయమై పోలీసులకు విద్యార్థి తండ్రి సాలు మాఝి, పాఠశాలకు చెందిన వారు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement