రాష్ట్రపతి రౌర్కెలా పర్యటన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి రౌర్కెలా పర్యటన

Apr 8 2026 7:50 AM | Updated on Apr 8 2026 7:50 AM

భువనేశ్వర్‌: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21వ తేదీన రౌర్కెలా పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా చేపట్టనున్న కార్యక్రమాలపై కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయెల్‌ ఓరం, ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీతో చర్చించారు. ఈ చర్చలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అనూ గర్గ్‌, రాష్ట్ర పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ యోగేష్‌ బహదూర్‌ ఖురానియా పాల్గొన్నారు.

ఉత్పత్తి రంగంలో నాల్కో కొత్త రికార్డు

జయపురం: కొరాపుట్‌ జిల్లా ధమన్‌జోడిలోని నాల్కో సంస్థ రికార్డు సృష్టించింది. గత 2025–26 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఉత్పత్త సాధించింది. గత నాలుగు దశాబ్దాలుగా బాకై ్సట్‌ ఉత్పాదనలో, ఎగుమతులలో రికార్డులు సృష్టిస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 77.01 లక్షల టన్నులు అల్యూమినియం ఉత్పత్తి చేసి కొత్త రికార్డు సృష్టించిందని అధికార వర్గాల వర్గాలు వెల్లడించాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 77.7 లక్షల టన్నుల బాకై ్సట్‌ ఎగుమతి చేసి నూతన రికార్డు స్థాపించింది. అలాగే అల్యూమిన హైగ్రేడ్‌ 23.00 లక్షల టన్నులు, క్యాలసైడ్‌ అల్యూమినియం 22.75 లక్షల టన్నులు ఉత్పాదన చేసినట్లు వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం అంటే 2026 మార్చ్‌ 31 నాటికి సాధించిన రికార్డుతో ఉత్పత్తి సాధించిన నాల్కో మతాబులు కాల్చి, మిఠాయిలు పంచుకుంది.

రత్న భాండాగారంలో

ఆభరణాల లెక్కింపు పునః ప్రారంభం

భువనేశ్వర్‌: పూరీ శ్రీ మందిరం రత్న భాండాగారంలో భద్రపరిచిన ఆభరణాల లెక్కింపు బుధవారం నుంచి తిరిగి ప్రారంభం అవుతుందని శ్రీ మందిర్‌ ముఖ్య నిర్వాహకుడు డాక్టర్‌ అరవింద్‌ కుమార్‌ పాఢి తెలిపారు. ఈ లెక్కింపు 11వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత 13వ తేదీన, 16 నుంచి 18వ తేదీ వరకు లెక్కింపు జరుగుతుందని ఆయన తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా సామాన్య భక్తుల దర్శన ఏర్పాట్లలో స్వల్ప మార్పులు చేశారు. లెక్కింపు జరిగే రోజున లోపలి ప్రాంగణం (భిత్తొరొ కఠొ) దర్శనం మూసివేయబడుతుంది. వెలుపలి ప్రాంగణం (బహారొ కఠొ) నుండి సర్వ దర్శనం పరిమితం చేశారు. ఈ దశ తర్వాత తదుపరి లెక్కింపు తేదీలను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. మార్చి 25న ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అధీకృత సేవకులు జగ మోహన్‌, గర్భగుడి లోపల తమ విధులను యథావిధిగా నిర్వర్తిస్తారు. శ్రీ జగన్నాథుని ఆలయ ఆచారాలు నిరాటంకంగా కొనసాగుతాయన్నారు.

పిడుగుపాటుకు ఆవు మృతి

జయపురం: జయపురం సబ్‌డివిజన్‌ బొయిపరిగుడ సమితి బలిగాం గ్రామ పంచాయితీ లకమాలియగుడ గ్రామంలో సోమవారం సాయంత్రం పెనుగాలులతో పిలుగులతో కూడిన వర్షం కురిసింది. ఈ సమయంలో పిడుగు పడి ఒక ఆవు ప్రాణాలు కోల్పోయింది. పశువుల కాపర్లు లకమాలియగుడ గ్రామ సమీపంలో ఆవులు, మేకలు గొర్రెలకు మేతకు తీసుకెళ్లారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో గాలులతో కూడిన వర్షం పడటంతో పశువులు చెల్లాచెదురై చెట్ల కిందకు చేరాయి. అందులో ఒక ఆవు చెట్టు కింద నిల్చొని ఉండగా పిడుగు పడి సంఘటనా స్థలంలోనే మరణించింది. మరణించిన ఆవు అదే గ్రామానికి చెందిన కమలలోచన పంగిదిగా గుర్తించారు. బాధితుడికి ఆర్థిక సహాయం అందజేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement