పది గంటల ట్రాఫిక్‌ జామ్‌ | - | Sakshi
Sakshi News home page

పది గంటల ట్రాఫిక్‌ జామ్‌

Apr 8 2026 7:50 AM | Updated on Apr 8 2026 7:50 AM

పది గంటల ట్రాఫిక్‌ జామ్‌

కొరాపుట్‌: అంతర్రాష్ట్ర సరిహద్దులో జరిగిన రోడ్డు ప్రమాదం వల్ల 10 గంటల ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో రాష్ట్ర సరిహద్దు కొరాపుట్‌ జిల్లా పొట్టంగి సమితి సుంకికి సమీపంలో ఆంధ్ర లోని కంకణా ఘాట్‌ వద్ద ప్రమాదం జరిగింది. కొరాపుట్‌ జిల్లా నుంచి బియ్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దాంతో రోడ్డు మార్గం మూసుకుపోయింది. ఈ మార్గంలో వందలాది వాహనాలు నిలిచి పోయాయి. విజయనగరం–రాయ్‌పూర్‌ జాతీయ రహదారి 26 కావడం తో వందలాది వాహనాలు నిలిచి పోయాయి. రాత్రి పూట తిరిగే అంతర్రాష్ట్ర బస్సులు నిలిచి పోయాయి. విజయవాడ, రాజమండ్రి, విశాఖ పట్నం, విజయ నగరం, బ్రహ్మపుర, భువనేశ్వర్‌, కటక్‌, పూరి నుంచి ఒడిశా వైపు జయపూర్‌, నబరంగ్‌పూర్‌, మల్కన్‌గిరి, జగదల్‌పూర్‌ వెళ్లే వందలాది బస్సులు ఇరు వైపులా నిలిచి పోయాయి. ఒడిశా, చత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చే బస్సులు కూడా చిక్కుకున్నాయి. ఉదయం 7 గంటలకు ఆంధ్రా పోలీసుల వచ్చేంత వరకు వేలాది ప్రజలు నరక యాతన పడ్డారు. మంగళ వారం ఉదయం 9 గంటలకు రెండు వైపులా వాహనాలు ముందుకు కదిలాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement