న్యూస్‌రీల్
ఉత్సాహంగా ర గ్బీ పోటీలు రగ్బీ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. క్రీడాకారులు ప్రతిభ చూపారు. –8లోu
జడ్డిమా మందిర ప్రారంభం పర్లాకిమిడిలో జడ్డిమా మందిరం ప్రారంభోత్సవం జరిగింది. మహిళలు పాల్గొన్నారు. –8లోu
● 163 సెక్షన్ జారీ
● పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు
● 53 మంది పోలీసులకు గాయాలు
శ్రీమందిరం ఆదాయం లెక్కింపు
భువనేశ్వర్: పూరీ జగన్నాథాలయం హుండీలో భక్తులు కానుకల రూపంలో సమర్పించిన ఆదాయాన్ని పాలకవర్గం మంగళవారం లెక్కించారు. ఇందులో నగదు రూ.3,64,753లు, బంగారం 10 గ్రాములు, వెండి 6 గ్రాముల 400 మిల్లీగ్రాములు వచ్చాయని అధికారులు తెలిపారు.
బుధవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
పోలీసులపై దాడి అమానుషం
రాయగడ: విధులు నిర్వహించేందుకు వెళ్లిన పోలీసులపై ఆందోళనకారులు చేసిన దాడి అమానుషమని ఎస్పీ స్వాతి ఎస్ కుమార్ అన్నారు. ఈ మేరకు దాడిని ఖండిస్తూ ఆమె మంగళవారం వీడియో సందేశం విడుదల చేశారు. కాశీపూర్ సమితి కండమాల్ గ్రామానికి చెందిన సుభాషిన్ మాఝి అనే నిందితుడిని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు దాడి చేశారని అన్నారు. నిందితుడిపై 14 కేసులు ఉన్న నేపథ్యంలో అరెస్టు చేసేందుకు వెళ్లగా అప్పటికే సగుబారి, కంధమాల్ తదితర గ్రామాలకు చెందిన గ్రామస్తులు ముందస్తు వ్యూహం ప్రకారం సామూహికంగా పోలీసులను రౌండప్ చేసి రాళ్లతో దాడి చేశారని తెలిపారు. ఈ దాడిలో 58 మంది పోలీసులు గాయపడ్డారని చెప్పారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు టియర్ ఫాగ్ విడుదల చేశామన్నారు.
రాయగడ: జిల్లాలోని కాశీపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమితిలోని సగుబారి పంచాయతీలోని సిజిమాలి బాకై ్సట్ నిక్షేపాలకు సంబంధించి తవ్వుకునేందుకు ప్రభుత్వం వేదాంత్ కంపెనీకి అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో సగుబారి గ్రామం నుంచి సిజిమాలి బాకై ్సట్ నిక్షేపాలు గల ప్రాంతం వరకు రహదారిని నిర్మించేందుకు కంపెనీ సన్నహాలు చేశారు. బాకై ్సట్ నిక్షేపాలు కొల్లగొడితే ఈ ప్రాంతం పర్యావరణం పరంగా పూర్తిగా దెబ్బ తింటుందని అందుకు ఆది నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రభావిత గ్రామాలకు చెందిన వారు రహదారి నిర్మాణానికి అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారిని బుజ్జగించే ప్రయత్నం చేసేందుకు మంగళవారం వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు రాళ్లు రువ్వడంతో 53 మంది పోలీసులకు గాయాలయ్యాయి. గాయాలు తగిలిన వారిలో ఎస్‌డీపీఓ గౌరహరి సాహు, ఏఎస్పీ అమూల్యకుమార్ ధర్, అండ్రాకంచ్ ఐఐసీ కూడా ఉన్నారు. గాయాలు తగిలిన వారిలో ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం వైజాగ్ తరలించారు. మిగిలిన వారిలో కొందరిని కాశీపూర్ పీహెచ్‌సీకి, మరికొందరిని టికిరిలొ గల ఉషాపాడు ఆస్పత్రికి తరలించారు. శాంతి భద్రతలు క్షీణించడంతో 163 సెక్షన్ అమలు చేశారు. ఆందోళన జరిగే సగుబారి గ్రామంలొ పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసు బందోబస్తుతో పాటు రిజర్వ్ పోలీసుల దళాలు మోహరించాయి.
అసలు జరిగిందేమిటి..
సగుబారి గ్రామానికి సమీపంలో గల సిజిమాలి ప్రాంతంలో ఉన్న బాకై ్సట్ ఖనిజ నిక్షేపాలను తవ్వుకునేందుకు వేదాంత కంపెనీకి ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. దీన్ని అనుసరించి ఆ ఖనిజ నిక్షేపాలను తవ్వేందుకు కంపెనీ యాజమాన్యం ఆయా ప్రభావిత ప్రాంతాల్లో గల గ్రామస్తులతో ఎలాంటి సమావేశాలను నిర్వహించకుండా వారి అనుమతులను తీసుకోకుండా కొండను తవ్వేందుకు కంపెనీ సన్నాహాలు చేసింది. ఈ నేపథ్యంలో సగుబారి నుంచి బాకై ్సట్ లభించే కొండ వరకు రహదారిని నిర్మించేందుకు సన్నాహాలు చేసింది. అయితే అందుకు ఆది నుంచి ఆ ప్రాంత వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రహదారి నిర్మాణంలో భాగంగా సొమవారం నాడు గ్రామస్తులకు, కంపెనీ సిబ్బంది మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తం కావడంతో జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి సోమవారం సగుబారి గ్రామానికి వెళ్లి గ్రామస్తులతో సమావేశమయ్యేందుకు ప్రయత్నించారు. అందుకు గ్రామస్తులు ఎలాంటి సహకారం అందించకపోవడంతో కలెక్టర్ పోలీస్ బందోబస్తు నడుమ వారిని మైకు ద్వారా బాకై ్సట్ తవ్వుకునేందుకు ప్రభుత్వం వేదాంత కంపెనీకి అనుమతి ఇచ్చిందని, అందుకు ఎవ్వరూ అభ్యంతరం చెప్పకూడదని వివరించారు. అదే రోజు రాత్రి కొంత మంది పోలీసులు సగుబారి గ్రామంలో చొరబడి గ్రామస్తులపై దురుసుగా ప్రవర్తించారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ క్రమంలొ పోలీసులు తమపై దాడి చేయడంతొ గ్రామానికి అనీ మాఝి, నారింగ దేయి మాఝి, లాలి మాఝి, కుముటి మాఝి, బామిణి మాఝి, బురుస మాఝి, నింగి మాఝి, ఆగాధ నాయక్, రామచంద్ర నాయక్‌తొ పాటు మరి కొందరు పోలీసుల దాడిలో గాయాలు పాలయ్యారని గ్రామస్తులు ఆరొపించారు.
మంగళవారం పోలీసుల బందోబస్తుతో సగుబారి గ్రామానికి చేరుకున్నారు. అయితే కొండపై ఉన్న గ్రామస్తులు మరణాయుధాలతో వ్యతిరేకించారు. తమ గ్రామంలొ గల ఖనిజ నిక్షేపాలను తవ్వుకునేందుకు తామెంతమాత్రం అనుమతించేది లేదని దీని వల్ల పర్యావరణం పూర్తిగా కలుషితమవ్వడంతొ పాటు అడవి తల్లిని నమ్ముకున్న తామంతా అనాథలమై జీవనోపాధిని కోల్పోతామని హెచ్చరించారు. అనంతరం పోలీసులపై రాళ్లు రువ్వారు.


