పలు భవనాల ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

పలు భవనాల ప్రారంభం

Apr 8 2026 7:08 AM | Updated on Apr 8 2026 7:08 AM

పర్లాకిమిడి: కాశీనగర్‌ బ్లాక్‌ బూదర పంచాయతీ గౌరీ గ్రామంలో ముఖ్యమంత్రి స్వతంత్ర సహాయ నిధి నుంచి రూ.4 లక్షలతో పునర్‌ నిర్మించిన శివ మందిరం, భోగ మండపాలను ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి మంగళవారం ప్రారంభించారు.

వన్న గ్రామంలో సామాజిక భవనం, భామిని గ్రామంలో సీఎం సహాయనిధి రూ.3 లక్షలతో నిర్మించిన స్వర్గద్వార్‌ (శ్మశానం)ను ప్రారంభించారు. కాశీనగర్‌ సమితి చైర్‌పర్సన్‌ బల్ల శాయమ్మ, జెడ్పీటీసీ (కాశీనగర్‌–1) రోక్కం రాజ్యలక్ష్మి, బూదర గ్రామ సమితి సభ్యులు బి.బాబూరావు, మాజీ ఉపాధ్యక్షుడు రఘురాం సాహు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement