చిత్రలేఖనం పోటీలకు అనూహ్య స్పందన
రాయగడ: స్థానిక స్పందన సాహితీ, సాంసృతిక సంస్థ 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రామలింగేశ్వర మందిరం ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన చిత్రలేఖనం పోటీలకు అనూహ్య స్పందన వచ్చింది. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. జూనియర్ విభాగానికి 86 మంది, సీనియర్ విభాగానికి 42 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచే విధంగా సృజనాత్మకమైన చిత్రాలను గీచారు. ప్రముఖ చిత్రకారుడు ఎం.జనార్దన ఆచారి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. విజేతలకు వార్షికోత్సవం రోజున బహుమతులను అందజేయనున్నట్టు సంస్థ అధ్యక్షుడు గుడ్ల గౌరి ప్రసాద్ తెలిపారు.


