ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి
కవిటి : జమేదారుపుట్టుగ గ్రామానికి ఇటుకల లోడుతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ఆదివారం కొజ్జీరియా జంక్షన్ సమీపంలో అదుపుతప్పి ప్రమాదానికి గురైన ఘటనలో కార్తీక్‌దాస్ (16) అనే యువకుడు తీవ్ర గాయాలపాలై మృతిచెందాడు. కవిటి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇచ్ఛాపురం మండలం రత్తకన్న నుంచి కవిటి మండలం జమేదారుపుట్టుగకు ట్రాక్టర్‌తో ఇటుకల లోడును తీసుకువచ్చే ప్రయాణంలో కొజ్జిరీయా జంక్షన్ వద్ద ట్రాక్టర్ వేగాన్ని నియంత్రించలేకపోవడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో కార్తీక్‌దాస్ ట్రాక్టర్ కిందపడి తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రయత్నం చేశారు. అప్పటికే కార్తీక్‌దాస్ మృతిచెందాడు. ఎస్‌ఐ వి.రవివర్మ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా హింజలిఘాట్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కార్తీక్‌దాస్ వ్యక్తిగత పని కోసం వచ్చాడా.. ట్రాక్టర్‌పై పనిచేసేందుకు వచ్చాడా అనేది విచారణలో తేలుతుందని పోలీసులు తెలిపారు.


