
బీజేపీ ప్రతినిధుల బృందం పర్యటన
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సబ్ డివిజన్ పరిధి లంజియా సవర తెగకు చెందిన ఆదివాసీలు నివసించే ప్రాంతాల్లో బీజేపీ ప్రతినిధుల బృందం బుధవారం పర్యటించింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు టి.గోపి ఆనంద్, సీనియర్ నాయకులు శివశంకర్ ఉలక, త్రినాథ్ గొమాంగో తదితరులతో కూడిన ఈ బృందం లంజియా సవరలు నివసించే పుటాసింగి, జలత్తార్, టొలన, అబడ, శగడ తదితర గ్రామాల్లో పర్యటించి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆయా గ్రామాల్లో పంటలు నష్టపోయిన రైతులను కలసి వివరాలు సేకరించారు. వర్షాల కారణంగా పాడైపోయిన రహదారులు, చెక్ డ్యాంల పరిస్థితిని అధ్యయనం చేశారు. ఈ ప్రాంతాల్లో వర్షాల కారణంగా నష్టం జరిగిన వివరాలను ఒక నివేదిక రూపంలో కలెక్టర్ అశుతోష్ కులకర్ణి దృష్టికి తీసుకెళ్లి, పరిహారం అందేలా చూస్తామని తెలియజేశారు.

బీజేపీ ప్రతినిధుల బృందం పర్యటన