
వృద్ధులు రోజూ వ్యాయామం చేయాలి
● జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా
● పర్లాకిమిడిలో వయోవృద్ధుల
దినోత్సవం
పర్లాకిమిడి: వయోవృద్ధులు పిల్లలపై ఽఆధారపడకుండా రోజూ వ్యాయామం చేస్తుండాలని జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా అన్నారు. స్థానిక బిజూ కళ్యాణ మండపంలో వయోవృద్ధుల దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. జిల్లా సామాజిక సురక్షా శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మఖ్యఅతిథిగా ఆదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఫాల్గునీ మఝి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయం ఏడు గంటలకు వృద్ధులకు యోగా శిక్షణ ఇచ్చారు. అనంతరం బీపీ, మధుమేహాం పరీక్షలు జరిపి ఉచితంగా మందులు అందజేశారు. గౌరవ అతిథులుగా జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, డాక్టర్ అనంతసామంత రాయ్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, ఉపాంత ప్రహారి, విశ్రాంత తహసీల్దార్ పూర్ణచంద్ర మహాపాత్రో, విశ్రాంత ఉపాధ్యాయులు బినోద్ జెన్నా, హారిమోహాన్ పట్నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడీఎం మఝి మాట్లాడుతూ.. సీనియర్ సిటిజన్లకు మెడికల్‌లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశామని, 25 మంది వయోవృద్ధులకు సీతాపురంలో ఆశ్రయం కల్పించామన్నారు. జిల్లాలో వయోవృద్ధులకు ఆయుస్మాన్ భారత్ స్వస్థ్య కార్డులు ప్రభుత్వం ఇంతవరకూ అందజేయలేదన్నారు. వృద్ధులకు సమాజంలో రక్షణ, గౌరవం కొరవడిందని విశ్రాంత తహసీల్దార్ పూర్ణచంద్ర మహాపాత్రో అన్నారు. సీనియర్ సిటిజన్లు నివేదితా రోథో, ఆశాలతా పాణిగ్రాహి, అశ్వినీ కుమార్ పాఢి, జగదీష్ చంద్ర మహాపాత్రో, గురండి గ్రామవాసి పినాకీ ప్రసాద్ జెన్నాలను దుశ్శాలువతో సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. 80 ఏళ్లు దాటిన వృద్ధులకు రూ.3,500 పింఛన్‌ను పర్లాకిమిడి పురపాలక సంఘం అందజేసింది. అలాగే వయో వృద్ధులు పూర్ణచంద్ర మహాపాత్రో, బినోద్ జెన్నాలను మెమెంటో, దుశ్శాలువతో జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా సన్మానించి గౌరవించారు. కార్యక్రమం జిల్లా సామాజిక సురక్షా ఽఅధికారి లక్కోజు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో జరింది.
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అతిథులు
రాయగడ: తమిళనాడులోని శ్రీమను జ్యోతి ఆశ్రమానికి చెందిన శ్రీమన్ నారాయణ, శ్రీలహరి క్రిష్ణ రచించిన శ్రీమద్భగత్ గీత విముక్తి రహస్యం పుస్తకావిష్కరణ కార్యక్రమం స్థానిక తేజస్వీ హోటల్ సమావేశం హాలోలో శుక్రవారం జరిగింది. ప్రముఖ విద్యావేత్త డాక్టర్ డీకే మహాంతి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు డాక్టర్ బాబూరావు మహాంతి, నటుడు, కళాకారుడు ప్రభాకర్ మిశ్రో, స్థానిక ప్రసాద్ టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్, తెలుగు పండితులు డాక్టర్ తులసి దాస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీమన్ నారాయణ లహరి క్రిష్ణ చే రచించబడిన శ్రీమద్భగవత్ గీత విముక్తి రహస్యం పుస్తకాన్ని ఒడియా భాషలో ప్రముఖ కవి ప్రదీప్ కుమార్ నాయక్ అనువదించారని ఆశ్రమానికి చెందిన టి.మార్టిన్ పేర్కొన్నారు. అనంతరం పుస్తకం సారాంశాన్ని వివరించారు. సృష్టిలొ దేవుడు ఒక్కడేనన్న సందేశంతో రచించిన ఈ పుస్తకాన్ని అందరూ చదవాలని అన్నారు. ఆధ్యాత్మిక గ్రంథమైన భగవద్గీతలోని పలు అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు డాక్టర్ డీకే మహాంతి మాట్లాడుతూ.. భగవద్గీత సనాతన ధర్మానికి ప్రతీకగా నిలిచిందని అన్నారు. అటువంటి మహాగ్రఽంథంలో ప్రతీ అంశం మానవాళి మనుగడకు దిశానిర్ధేశం చేస్తుందని వివరించారు. డాక్టర్ బాబూరావు మహాంతి మాట్లాడుతూ.. ఇటువంటి తరహా ఆధ్యాత్మిక కార్యక్రమాలు తరచూ జరిగే విధంగా సంస్థలు కృషి చేయాలని అన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా మన హైందవ సంప్రదాయం, సంస్కృతులు, మన ఆచార వ్యవహారాలు భావితరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

వృద్ధులు రోజూ వ్యాయామం చేయాలి

వృద్ధులు రోజూ వ్యాయామం చేయాలి

వృద్ధులు రోజూ వ్యాయామం చేయాలి

వృద్ధులు రోజూ వ్యాయామం చేయాలి

వృద్ధులు రోజూ వ్యాయామం చేయాలి