
హత్య కేసులో నిందితుడి అరెస్టు
రాయగడ: జిల్లాలోని రామనగుడ సమితి గోగుపాడు పంచాయతీలోని సికల గ్రామ సమీపంలోని ఒండరాబంగ్ కొండపై ఒక యువకుని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న కేసులో సంబంధం ఉన్న నిందితుడుని శుక్రవారం అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తి పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం పార్వతీపురం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం ఆడురుబంగీ గ్రామానికి చెందిన మంగులు మండంగి (52)గా గుర్తించారు. అతని నుంచి రెండు నాటు తుపాకీలను స్వాధీనం చేసుకుని నిందిడుడిని గుణుపూర్ సబ్ డివిజన్ కోర్టుకు తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. ఈ నెల ఏదో తేదీన సికల గ్రామ సమీపంలోని ఒండురుబంగ్ కొండపై మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుని ఆధార్ కార్డును ఆధారంగా మృతుడు పువ్వల పారయ్యగా పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒండురుబంగ్ గ్రామవాసిగా పోలీసుల దర్యాప్తులో తేలింది. అనంతరం మృతుని కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో వారు రామనగుడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

హత్య కేసులో నిందితుడి అరెస్టు

హత్య కేసులో నిందితుడి అరెస్టు