రాయగడ: స్థానిక బాలాజీనగర్‌లోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం త్రిరాత్ర పవిత్రోత్సవ పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, రాంజీ ఆచార్యుల ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవ, శాత్తుమురై, మంగళశాసన పూజలను నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది.
వాహన తనిఖీలు
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరిలో పోలీసులు, ఆర్టీవో సిబ్బంది సంయుక్తంగా వాహన తనిఖీలను శనివారం నిర్వహించారు. నియమాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. 35 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.3,88,875ల జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అవగాహన కల్పించారు.
భక్తిశ్రద్ధలతో పూజలు