
జిల్లా కేంద్ర ఆస్పత్రికి బ్యాటరీ అంబులెన్స్ వితరణ
కొరాపుట్:
జయపూర్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి బ్యాటరీ అంబులైన్స్ వితరణ శుక్రవారం జరిగింది. ప్రముఖ వ్యాపారస్తులైన దివంగత జయ్‌కుమార్ జైన్, విజయ్ కుమార్ జైన్‌ల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఈ వాహనాన్ని సమకూర్చారు. ఆస్పత్రి ప్రధాన ద్వారం నుంచి వైద్య భవనాలు చాలా దూరంగా ఉన్నాయి. దీంతో వృద్ధు రోగులు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. వారి సౌకర్యార్ధం బ్యాటరీతో చేసిన ప్రత్యేక వాహనం జైన్ కుటుంబీకులు అందజేయగా.. జయపూర్ సబ్ కలెక్టర్ ఆకవరం సస్యరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో జైన్ కుటుంబానికి చెందిన సంజయ్ కుమార్ జైన్ పాలొగన్నారు.

జిల్లా కేంద్ర ఆస్పత్రికి బ్యాటరీ అంబులెన్స్ వితరణ