
సెంచూరియన్ విశ్వవిద్యాలయానికి అరుదైన గుర్తింపు
● డబ్ల్యూయూఆర్ ర్యాంక్ ప్రదానం
భువనేశ్వర్: సెంచూరియన్ విశ్వవిద్యాలయం ప్రపంచ గుర్తింపు సాధించింది. ఈ ఏడాది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్‌ఈ) ప్రచురించిన ప్రతిష్టాత్మక వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ (డబ్ల్యూ యూఆర్)–2026లో జాతీయ, అంతర్జాతీయ ర్యాకింగులు సొంతం చేసుకుంది. ప్రపంచ స్థాయిలో 1501+ గ్లోబల్ ర్యాంక్, జాతీయ స్థాయిలో 98వ ర్యాంక్‌ను సాధించి రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అద్భుతమైన మైలురాయిని ఆవిష్కరించింది. ఇదివరకు వరుసగా 2 సార్లు టీహెచ్‌ఈ రిపోర్టర్ లిస్ట్, ఎస్‌డీజీ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకుంది.
ఈ ప్రపంచ గుర్తింపు బోధన, పరిశోధన, ఆవిష్కరణ, సామూహిక సాధికారత దిశలో విశ్వ విద్యాలయం పుంజుకుంటున్న నైపుణ్యతకు అద్దం పడుతుంది. నైపుణ్యం–సమగ్ర, సమగ్ర విద్యాభ్యాసంతో నైపుణ్యతకు సాన పెడుతూ భారత దే శంలోని అత్యంత ప్రగతిశీల విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా సెంచూరియన్ తన ఉనికిని చాటుకుంటోంది. జాతీయ స్థాయిలో సెంచూరియన్ విశ్వ విద్యాలయం 100 మేటి విశ్వవిద్యాలయాలలో ఒకటిగా కొనసాగుతోంది. ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాల సరసన తళుక్కమంటోంది. ప్రత్యేకమైన ‘నైపుణ్య–సమగ్ర ఉన్నత విద్య’ నమూనా, గ్రామీణ మరియు సామాజిక వ్యవస్థాపకత పట్ల ప్రాధాన్యతతో బోధన శైలితో భారత దేశ ఉన్నత విద్యా సంస్థల జాబితాలో దానిని ప్రత్యేక స్థానం సొంతం చేసుకోవడం విశేషం. సెంచూరియన్ యూనివర్సిటీ యొక్క గ్లోబల్ ర్యాంక్ బోధనా నాణ్యత, లోతైన పరిశోధన, జ్ఞాన సముపార్జన రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ ప్రామాణికలతో సుస్థిర పురోగతితో దినదినాభివృద్ధి చెందుతోంది.
ప్రపంచ స్థాయిలో సెంచూరియన్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ విద్య, పరిశోధన ఆధారిత ప్రామాణికలతో ఆవిష్కరణ, సామాజిక పరివర్తన సమన్వయాన్ని దృఢపరుస్తుంది. ఐక్య రాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డీజీ), గ్రామ్ తరంగ్ ఎంప్లాయిబిలిటీ ట్రైనింగ్ సర్వీసెస్, ఇండస్ట్రీ స్పాన్సర్డ్ లాబొరేటరీస్, స్టార్టప్ ఎకోసిస్టమ్‌ల వంటి చొరవలతో సెంచూరియన్ విశ్వవిద్యాలయం సమయోచిత కార్యాచరణ పలు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు సాధించి విద్యావేత్తలు, నైపుణ్యతలు, పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించి వెనుకబడిన ప్రాంతాల నుంచి యువతకు సాధికారత కల్పించడంలో ముందడుగు వేస్తుంది. ఉపాధి, వ్యవస్థాపకత, సామాజిక ప్రభావానికి ప్రేరణాత్మక విద్యతో సెంచూరియన్ విశ్వవిద్యాలయం అనేక సంక్లిష్ట లక్ష్యాల్ని ఛేదించి తరచూ సరికొత్త విజయాల్ని సాధిస్తుంది. తాజాగా రిపోర్టర్ జాబితాలో స్థానం సాధించి ప్రపంచ వ్యాప్తంగా ర్యాంకింగు విశ్వవిద్యాలయంగా నిలిచింది. పరిశోధన నైపుణ్యాల మేళవింపుతో విద్యావేత్తలను తీర్చిదిద్దుతుందని వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసరు సుప్రియా పట్నాయక్ తెలిపారు.