
స్నేహమే శాశ్వతం
రాయగడ: స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక స్వాగత్ లైన్‌లోని శ్రీరామలింగేశ్వర ఆలయం ప్రాంగణంలో స్పందన సాహితీ, సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి పతివాడ తులసీ దాస్, సాంస్కృతిక విభాగం కార్యదర్శి కేకేఎం పట్నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కళాకారులు, సాహితీ వేత్తలు పాల్గొన్నారు. స్నేహమంటే పాలు, నీళ్లులా కలిసి పోవాలని వక్తలు పేర్కొన్నారు. పాలలాంటి స్వచ్ఛమైనది కేవలం స్నేహం మాత్రమేనని కవి భళ్లమూడి నాగరాజు అన్నారు. ఈ సందర్భంగా గాయనీ, గాయకులు పాడిన పాటలు ప్రేక్షకులను అలరించాయి. విశ్రాంత అధ్యాపకులు శివకేశరరావు, గిరీష్ పట్నాయక్ పాల్గొన్నారు.