
7న సురేఖ పాణిగ్రాహి సంతాప సభ
పలాస: మండలంలోని బొడ్డపాడులో ఈనెల 7వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రముఖ విప్లవ కవి, శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాట యోధుడు సుబ్బారావు పాణిగ్రాహి సతీమణి సురేఖ పాణిగ్రాహి సంతాప సభ నిర్వహించనున్నట్లు సంతాప సభ నిర్వహణ కమిటీ ప్రతినిధులు, గ్రామస్తులు తెలియజేశారు. ఈ మేరకు సంతాప సభ కరపత్రాలు, వాల్ పోస్టర్లు బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరం వద్ద ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సురేఖ పాణిగ్రాహి సంతాప సభ నిర్వహించుకోవడమంటే ఆనాటి శ్రీకాకుళం పోరాటాలు, ఆ పోరాటంలో అమరుల త్యాగాలను గుర్తు చేసుకోవడమేనన్నారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అమరుల బంధుమిత్రుల కమిటీ నాయకులు పాల్గొన్నారు.

7న సురేఖ పాణిగ్రాహి సంతాప సభ