ఘోర రోడ్డు ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం

Aug 4 2025 5:04 AM | Updated on Aug 4 2025 5:04 AM

ఘోర ర

ఘోర రోడ్డు ప్రమాదం

జనావాసాల్లోకి దూసుకుపోయిన

భారీ ట్యాంకర్‌

ఒకరి మృతి.. మరో ఇద్దరికి గాయాలు

నష్టపరిహారం చెల్లించాలని రాస్తారోకో

రాయగడ: సదరు సమితి కుంభికోట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల గుమ్మ గ్రామంలొ ఆదివారం తెల్లవారున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టికిరి నుంచి వస్తున్న ఒక భారీ ట్యాంకర్‌ గుమ్మ ఘాటి దిగుతుండగా అదుపు తప్పి సరాసరి జనవాసాల్లోకి దూసుకుపొయింది. ఈ ఘటనలో లక్ష్మీ పాత్రొ (61) సంఘటన స్థలం వద్దే మృతి చెందగా ఆమె భర్త కరుణాకర్‌ పాత్రో, ట్యాంకర్‌ డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారుం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, బాధితులు తెలియజేసిన వివరాల ప్రకారం..

అంతా నిద్రిస్తున్న సమయంలో పెద్ద శబ్దం రావడంతో అంతా ఉలిక్కిపడ్డారు. భారీ ట్యాంకర్‌ గుమ్మ గ్రామం రోడ్డుకు పక్కనే ఉన్న జనావాసాల్లొకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒక ఇల్లు మరో రెండు దుకాణాలు ధ్వంసమయ్యాయి. లక్ష్మీ పాత్రో, ఆమె భర్త కరుణాకర్‌ పాత్రో ఇంటిలొ నిద్రిస్తుండగా ట్యాంకర్‌ ఢీకొనడంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఇంటి శిథిలాలు, ట్యాంకర్‌ మధ్యలో ఇరుక్కుపొయిన కరుణాకర్‌ను అదేవిధంగా ట్యాంకర్‌ డ్రైవర్‌ను అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద బయటకు తీసుకురావడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. శిథిలాల్లో ఇరుక్కుపొయిన లక్ష్మీపాత్రో మృతదేహాన్ని రెండు గంటల తర్వాత జేసీబీ సాయంతో శిథిలాలను తొలగించాక బయటకు తీశారు.

నష్ట పరిహారం చెల్లించాలని రాస్తారోకో

ఈ ప్రమాదంలొ మృతి చెందిన లక్ష్మీపాత్రొ కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గుమ్మ గ్రామం రహదారిపై అడ్డుకట్టలను వేసి టైర్లను తగులబెట్టి రాస్తారోకో చేపట్టారు. దీంతో రాయగడ మీదుగా ఇటు కొరాపుట్‌, లక్ష్మీపూర్‌ అదేవిధంగా కాశీపూర్‌, టికిరి ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది వాహనాలు దారి పొడవునా నిలిచిపోవడంతో రాయగడ తహసీల్దార్‌ ప్రియదర్శిని స్వయి సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబీకులకు నచ్చజెప్పారు. అనంతరం లక్ష్మీపూర్‌ ఎమ్మెల్యే రఘురాం మచ్చ , రాయగడ నుంచి బిజేపి నాయకుడు యాల్ల కొండబాబులు గుమ్మ గ్రామానికి చేరుకున్నారు. ఆందోళనకారులతొ బాధిత కుటుంబీకులతో మాట్లాడారు. తగిన నష్ట పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించే విధంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఘోర రోడ్డు ప్రమాదం1
1/4

ఘోర రోడ్డు ప్రమాదం

ఘోర రోడ్డు ప్రమాదం2
2/4

ఘోర రోడ్డు ప్రమాదం

ఘోర రోడ్డు ప్రమాదం3
3/4

ఘోర రోడ్డు ప్రమాదం

ఘోర రోడ్డు ప్రమాదం4
4/4

ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement