
11 నుంచి మినిస్టీరియల్ ఉద్యోగుల సామూహిక సెలవు
పర్లాకిమిడి: ఈ నెల 11వ తేదీన నుంచి రెవెన్యూ మినిస్టీరియల్ ఉద్యోగులు సామూహిక సెలవలోకి వెళ్లాలని నిర్ణయించారు. ఒడిశా రెవెన్యూ మినిస్టీరియల్ సంఘం నాయకులు స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లాలో పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగులకు సంబంధించి ధీర్ఘకాలంగా ఉన్న తొమ్మిది డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చనందున గజపతి జిల్లా రెవెన్యూ సంఘం అధ్యక్షులు జుధిస్టర్ రణసింగ్, కార్యదర్శి సంతను మిశ్రా 11వ తేదీ నుంచి నిరవధికంగా సామూహిక సెలవు ఆందోళనలో వెళుతున్నామని ప్రకటించారు. దీనికి జిల్లాలోని రెవెన్యూ సంఘం సభ్యులు, ఉద్యోగులు సహకరించాలని కోరారు. ఒడిశా రెవెన్యూ మినిస్టీరియల్ సంఘం ఉద్యోగులకు ఓఆర్‌ఎస్‌పీ–2017 నియమావళి ప్రకారం జీతాలను తొమ్మిది లెవల్‌కు పెంచాలని, పాత పింఛన్ విధానం అమలు, ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 20 లక్షల వరకూ ఆరోగ్యశ్రీ కార్డులు, 1990 ప్రభుత్వం అమలు చేసిన నియమావళి ప్రకారం విధి నిర్వాహణలో మృతి చెందిన కుటుంబాలకు యోగ్యాతాను సారం ఉద్యోగం ఇవ్వాలన్న డిమాండలను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన జరుపుతున్నారు. జూన్ మాసంలో నల్లబ్యాడ్జిలు ధరించి పదిరోజుల పాటు నిరసన ఆందోళన కార్యక్రమం కూడా చేపట్టారు. అయితే ప్రభుత్వం డిమాండ్ల పరిష్కారానికి ముందుకు రాకపోవడంతో రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆదేశాల మేరకు ఆందోళనకు తప్పడం లేదని జిల్లా అమలా సంఘం కార్యదర్శి సంతును మిశ్రా తెలియజేశారు.
1300 కిలోల గంజాయి స్వాధీనం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి బోడిగేట పంచాయతీ టేక్‌గూఢ గ్రామ అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి కలిమెల పోలీసులు దాలు నిర్వహించి భారీగా గంజాయి బస్తాలను పట్టుకున్నారు. పెట్రోలింగ్‌కు కలిమెల ఐఐసీ ముకుందో మేల్కా నేతృత్వంలో సిబ్బంది వెళ్లగా వారికి రోడ్డు పక్కన అటవీ ప్రాంతంలోని ఓ చోట అనుమానాస్పదంగా కొని బస్తాలు కనిపించారు. దీంతో వారు అక్కడికి వెళ్లి పరిశీలించగా బస్తాల్లో గంజాయి ఉండటాన్ని గుర్తించారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ బస్తాలను ఎవరు ఇక్కడ ఉంచారో ఆరా తీస్తున్నారు. ఆదివారం ఉదయం గంజాయిని తూకం వేయగా 52 బస్తాల్లో 1300 కిలోలు ఉన్నట్టు నిర్ధారించారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ సుమారు రూ. 80 లక్షలు ఉంటుందని ఐఐసీ ముకుందో మేళ్కా విలేకరులకు తెలిపారు.