
మేరింగి గ్రామానికి చేరుకున్న వైద్య బృందం
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సబ్ డివిజన్ పరిధిలో గల ఘనాంత్రి పంచాయతీలోని మేరింగి గ్రామాన్ని జ్వరాలు పీడిస్తున్నాయని ‘సాక్షి’లో ఆదివారం కథనం ప్రచురితమైంది. దీంతో జిల్లా యంత్రాంగం స్పందించింది. ఆదివారం నాడు వైద్య బృందం ఆ గ్రామంలో పర్యటించాయి. ఇంటింటా తిరిగి గ్రామస్తుల ఆరోగ్య సమాచారాన్ని సేకరించారు. వారు వినియోగిస్తున్న తాగునీటిని పరిశీలించారు. అదేవిధంగా మురికి కాలువల పరిస్థితిని చూసి అవగాహన కల్పించారు. పరిసరాలు శుభ్రంగా ఉంచాలని చైతన్య పరిచారు. అనంతరం గ్రామస్తులతో వైద్య బృందం కాసేపు మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. జ్వరాలు, డయేరియా వంటివి వ్యాపించడానికి గల కారణాలను వివరించారు. ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా ఆస్పత్రికి వెళ్లి చూపించుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అనంతరం వైద్య శిబిరాన్ని నిర్వహించి అనారోగ్యంగా ఉన్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. రాయగడ జిల్లా అదనపు ముఖ్య వైద్యాధికారి డాక్టర్ ప్రదీప్ కుమార్ సుబుద్ధి నేతృత్వంలో డాక్టర్ రాధాకృష్ణ సేనాపతి, ఆరోగ్యగ్య కార్యకర్తలు, టెక్నీషియన్లు తదితరులు మేరింగి గ్రామంలొ పర్యటించిన వైద్య బృందంలో ఉన్నారు.

మేరింగి గ్రామానికి చేరుకున్న వైద్య బృందం

మేరింగి గ్రామానికి చేరుకున్న వైద్య బృందం

మేరింగి గ్రామానికి చేరుకున్న వైద్య బృందం